Share News

నేటితో ముగియనున్న జంగారెడ్డిగూడెం, నూజివీడు పురపాలన గడువు

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:09 AM

జిల్లాలో జంగారెడ్డిగూడెం, నూజివీడు పురపాలక సంఘా ల పాలకవర్గాల పదవీ కాలం ఈనెల 17వ తేదీతో ముగియనుంది.

నేటితో ముగియనున్న జంగారెడ్డిగూడెం, నూజివీడు  పురపాలన గడువు

ఏలూరు, మార్చి 16(ఆంధ్రజ్యోతి):జిల్లాలో జంగారెడ్డిగూడెం, నూజివీడు పురపాలక సంఘా ల పాలకవర్గాల పదవీ కాలం ఈనెల 17వ తేదీతో ముగియనుంది. ఏలూరు కార్పొరేషన్‌కు సెప్టెంబరు వరకు మేయర్‌ నూర్జహాన్‌ పదవీ కాలం ఉంది. చింతలపూడి నగర పంచాయతీకి ఎన్నికలు జరగక పోవడంతో జంగారెడ్డిగూడెం ఆర్డీవోనే స్పెషలాఫీసర్‌గా కొనసాగుతున్నారు. 2021 మార్చి 17న జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా బత్తిన నాగలక్ష్మి (వైసీపీ), నూజివీడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా రామిశెట్టి త్రివేణి దుర్గ(వైసీపీ) కొలువుతీరారు. వీరి పదవీ కాలం పూర్తి కావడంతో ఈ రెండుచోట్ల చైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు ఇక మాజీలు కానున్నా రు. చివరిరోజు మంగళవారం పాలకవర్గాలు కలిసి గ్రూప్‌ ఫొటోలు దిగి.. పదవుల నుంచి వైదొలగనున్నారు. తాజాగా ఈ రెండు మున్సి పాలిటీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ పురపాలకశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌ కుమార్‌ ఈ నెల 10న ఉత్తర్వులను జారీ చేసిన విషయం విదితమే. జంగారెడ్డిగూడెం స్పెషలాఫీసర్‌గా జిల్లా జేసీ అభిషేక్‌ గౌడ, నూజి వీడుకు సబ్‌ కలెక్టర్‌ బొల్లేపల్లి వినూత్న ఈనెల 18న బాధ్యతలు చేపట్టనున్నారు. పంచాయతీల తో పాటు, పురపాలక సంఘాల్లో ఓటర్ల జాబితా ల పరిశీలన పూర్తి కాలేదు. ఇంకా ఎన్నికలకు ఏర్పాట్లు ఊపందుకోకపోవడంతో స్పెషలాఫీసర్ల పాలన ఎంతకాలం కొనసాగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

Updated Date - Mar 17 , 2026 | 12:09 AM