ఉత్సాహంగా లేజర్ రన్ పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:26 AM
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని క్రీడాకారులకు లభించే ప్రతి అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య పిలుపునిచ్చారు.
గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి : ఏలూరు ఎమ్మెల్యే చంటి
ఏలూరురూరల్, జూలై 11(ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని క్రీడాకారులకు లభించే ప్రతి అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య పిలుపునిచ్చారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించే మోడరన్ పెంటాథ్లాన్ లేజర్ రన్ చాంపియన్‌షిప్–2026 క్రీడాపోటీలను శనివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత క్రీడల అభివృద్ధికి విశేష ప్రాధాన్యం కల్పించిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. క్రీడల్లో గెలుపు ఓటమిలను సమానంగా తీసుకోవాలన్నారు. ఏఎస్‌ఆర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఐదు విభాగాలలో పోటీలు
ఈ పోటీలు ఐదు విభాగాలలో జరిగాయి. లేజర్ రన్ పోటీల్లో క్రీడాకా రులు నిర్ణీత దూరం పరుగెత్తి లేజర్ పిస్టల్‌తో లక్ష్యాన్ని కచ్చితంగా చేధిస్తూ తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీలు ఉత్సాహభరిత వాతావ రణంలో సాగగా, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఏపీ స్పోర్ట్స్ డైరెక్టర్ కె.జగదీశ్వరి, డీఎస్‌డీవో ఎస్.ఏ అజీజ్, ఏపీ మోడరన్ పెంటాథ్లాన్ ఛైర్మన్ సీహెచ్ వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ కె.హరిబాబు, వైస్ ఛైర్మన్ పి.షన్ముగం, డైరెక్టర్ కె.కృష్ణ, డి.వెంకటేశ్వరరావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ మరడాని అచ్యుతురావు పాల్గొన్నారు. కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్ పర్యవేక్షించారు.