ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:48 AM
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసే లా అఽధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ కోరారు.
20 సూత్రాల కమిటీ అమలు చైర్మన్ లంకా దినకర్
ఏలూరు, జూలై 28(ఆంధ్రజ్యోతి): కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసే లా అఽధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ కోరారు. ఏలూరులోని కలె క్టరేట్‌లో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు, కొల్లేరు సరస్సు పరిరక్షణ తదితర అంశాలపై ఆయన మంగళవారం సమీక్షించారు. ఆయన మాట్లాడతూ.. ‘జల్‌జీవన్, అమృత్ పఽథకాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలి. గత ప్రభుత్వంలో ఈ పథకాల ద్వారా కుళాయి కనెక్షన్లు గుర్తించడానికి వదిలేశారు. ప్రస్తు తం రాష్ట్రం అమలు చేస్తున్న జలధార–జలహారతి పథకం ద్వారా భూగర్భ జలాల వృద్ధికి ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నారు. కొల్లేరు సమస్య పరిష్కారం విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయి. జిల్లాకు రావడం ఇది రెండోసారి, ప్రభుత్వ పథకాల పనితీరు మెరుగు పడింది’ అంటూ ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
వీబీ జీ రామ్‌జీ కింద 125 రోజుల పనిదినాలు
ప్రతిపక్షాలు ఉపాధిహామీ పథకంలో వీబీజీ రామ్ జీ తీసుకు రావడంపై గగ్గోలు పెట్టాయని, ఈ పథకం ద్వారా 125 రోజులు పనులు కల్పిస్తారని ఆయన వివరించారు. డ్వామా పీడీ వెంకట సుబ్బారావును ఈ పథకంపై ఆరా తీస్తూ అర్హత కలిగిన ప్రతి కార్మి కుడికి జాబ్‌కార్డు అందించి పని కల్పించాలని, మెటీ రియల్ కాంపోనెట్ కంటే వేతనాల పద్దులో అధికంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. విద్యా, వైద్య సౌక ర్యాలు మెరుగుపర్చడానికి పటిష్ట చర్యలు తీసుకోవా లని యంత్రాంగాన్ని కోరారు. కలెక్టర్ వెట్రిసెల్వి మా ట్లాడుతూ పీఎం సూర్యఘర్ కార్యక్రమంలో రాష్ట్రంలో ఏలూరు ప్రఽథమస్థానంలో నిలిచిందని, వీబీజి రామ్‌జీ పథకంలో రూ.437 కోట్లతో 427 కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నా మన్నారు. కైక లూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లా డుతూ కొల్లేరులో జిరాయితీ, ఇతర భూముల దారులకు న్యాయం చేయాలని, రోడ్లు, తాగునీరు, విద్యుత్ తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. కొల్లేరు ప్రాంతంలో మకానా బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ మాట్లాడుతూ గర్భిణుల ప్రసవాలు తప్పనిసరిగా ఆసుపత్రుల్లోనే జరిగేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జేసీ అభిషేక్ గౌడ, జిల్లా అటవీశాఖాధికారి పీవీ సందీప్‌రెడ్డి, డీఆరో శ్రీదేవి, జడ్పీ సీఈవో జగదాంబ, ఆర్డీవోలో లక్ష్మీప్రసన్న, సీపీవో కంటిపూడి శ్రీనివాస్, డీపీవో మల్లికార్జునరావు, డీ ఎంహెచ్‌వో శోభ, ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మిలు పాల్గొన్నారు.
దినకర్‌ను కలిసిన కూటమి శ్రేణులు
జిల్లా పర్యటనకు వచ్చిన దినకర్‌ను ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిశోర్, స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ కట్నేని కృష్ణప్రసాద్, గాది రాంబాబు, ఇతర నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.