Share News

ఎల్‌పీఎం చిక్కులు!

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:17 AM

గ్రామాలు, పట్టణాల్లో భూముల సమ స్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతు న్నాయి. భూ వివాదాల పరిష్కారంలో కీలకమైన జాయింట్‌ ఎల్‌పీఎంల సమస్యలు పలు మండలాల్లో పరిష్కా రం కావడం లేదు.

ఎల్‌పీఎం చిక్కులు!

జిల్లాలో 10 వేలకు పైగా పరిష్కారం కాని కేసులు

ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లోనే సమస్యలు ఎక్కువ

గ్రామాలు, పట్టణాల్లో భూముల సమ స్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతు న్నాయి. భూ వివాదాల పరిష్కారంలో కీలకమైన జాయింట్‌ ఎల్‌పీఎంల సమస్యలు పలు మండలాల్లో పరిష్కా రం కావడం లేదు. దీంతో రైతులు, ప్రజలు, ప్రైవేట్‌ భూయజమానులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగు తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు సంబంధించిన వాటికి ఎల్‌పీఎంల సమస్యతో లబ్ధిదారులు ఇప్పటికీ సతమతం అవుతున్నారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రైతులు, ప్రైవేట్‌ వ్యక్తులు, ప్రభుత్వ భూములకు సంబంధించి జాయింట్‌ ఎల్‌పీ ఎంల చిక్కుముడి వీడడం లేదు. కూటమి సర్కార్‌ కొలువు తీరి రెండేళ్లవుతున్నా ఇంకా ఈ సమస్యలపై ప్రతిష్టంభన తొలగడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీ సర్వే తాలూకా సమస్యలు ఇప్పటి రైతులకు శాపంగా పరిణమిస్తోంది. అప్పట్లో సర్వే నంబర్లకు బదు లు ప్రవేశపెట్టిన జాయింట్‌ ఎల్‌పీఎం (ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌) నంబర్‌ చిక్కులు వీడడం లేదు.

క్షేత్రస్థాయిలో కదలిక లేదాయే..

ఐదారుగురు రైతులకు కలిపి ఒకే ఎల్‌పీఎం కేటాయించడంతో వారికి అటు పంట రుణాలు, ఇటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందడం లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. కూటమి సర్కార్‌ వచ్చాక ఈ సమస్య పరిష్కా రానికి అడుగులు పడ్డా క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రతినెలా పట్టాదారు పుస్త కాలు పంపిణీ, ఇతర కార్యకలాపాలు, నిరంతర విచారణలతో ఎల్‌పీఎంల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందాన ఉన్నాయి.

రుసుం తగ్గించినా.. దక్కని న్యాయం

జాయింట్‌ ఎల్‌పీఎంల సమస్యలను క్షేత్ర స్థాయిలో సునాయాసంగా పరిష్కరించుకునేం దుకు వాటికయ్యే ఆన్‌లైన్‌ ఖర్చులను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. రైతుల సౌకర్యార్థం రూ.500 నుంచి రూ.50 వరకు తగ్గించినా అన్నదాతల్లో అసంతృప్తి తొలగడం లేదు. పట్టా దారు పాస్‌పుస్తకాల్లో విస్తీర్ణం ఆన్‌లైన్‌ మారక పోవడం, వీఆర్వోల చేసినవి తహసీల్దార్లు లాగిన్‌లోకి ఎంట్రీ కాకపోవడం వల్ల కూడా ఎల్‌పీఎంల సమస్యలు పరిష్కారం కావడం లేదన్న విమర్శలున్నాయి.

547 గ్రామాలు.. 10 వే లకు పైగా..

గతేడాది అన్నదాత సుఖీభవ ప్రవేశపెట్టిన సందర్భంలో కొంతమేరకు ఎల్‌పీఎంల సమస్య లను పరిష్కరించారు. మొత్తం 14 వేలకు పైగా ఈ సమస్యలుండగా, ఇప్పుడవి 10 వేలకు చేరి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రధా నంగా గ్రామసభల్లోను, రెవెన్యూ క్లినిక్‌ల్లోనూ అర్జీలు వచ్చినా ఈ అంశంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నాలుగో విడత భూముల రీ సర్వే జరగడం వల్ల సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది అటువైపుగా వెళ్లడంతో ఎల్‌పీంల గోడు పట్టిం చుకునే నాథుడే కరువయ్యారు. ఎల్‌పీఎంల సమస్యల పరిష్కారంపై జిల్లా సర్వేశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎండీ ఆన్సారీని వివరణ కోరగా.. దరఖాస్తులు అందిన వెంటనే ప్రాధాన్యతల వారీగా పలు మండలాల్లో ఇటీవల చాలావరకు పరిష్కరించినట్టు తెలిపారు.

Updated Date - Jun 05 , 2026 | 12:17 AM