అంతా మనదే.. తవ్వేయ్ !
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:39 AM
జిల్లా లో ప్రాధాన్యత కలిగిన నియోజక వర్గంలో ఒకటి.. అదీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి ప్రాతి నిధ్యం వహిస్తున్న నియోజక వర్గం.. మరోవైపు డివిజన్ ఉన్నతాధికారిగా ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షిస్తున్న నియోజకవర్గం.
అనుమతులు గోరంత.. మట్టి తోలకాలు కొండంత!
నూజివీడు పెద్ద చెరువు మట్టి తోలకాలపై విజిలెన్స్ దాడులు
ఒక జేసీబీ, ఒక ఎక్స్‌కవేటర్, ఎనిమిది ట్రాక్టర్లు స్వాధీనం
నూజివీడు, జూలై 16(ఆంధ్రజ్యోతి): జిల్లా లో ప్రాధాన్యత కలిగిన నియోజక వర్గంలో ఒకటి.. అదీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి ప్రాతి నిధ్యం వహిస్తున్న నియోజక వర్గం.. మరోవైపు డివిజన్ ఉన్నతాధికారిగా ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షిస్తున్న నియోజకవర్గం. అయినా ఇక్కడ అక్రమ మట్టి తోలకాల పరిస్థితి అనుమతులు గోరంత, తవ్వకాలు కొండంత అనేలా సాగుతు న్నాయి. ప్రతీ అధికార సమీక్షలోను అక్రమ మట్టి తోలకాలపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అధికారులను హెచ్చరిస్తూనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మట్టి అవసరాలకు విధిగా అనుమ తులు తీసుకుని మట్టి తోలకాలు చేయాల్సిందే అంటూ గ్రామస్థాయిలోనూ అవగాహన కల్పి స్తున్నారు. అయినా అక్రమ మట్టి తోలకాలపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి. పగటిపూటే కొన్ని నెలలుగా యథేచ్ఛగా మట్టి తోలకాలు సాగుతుండడంపై గ్రామీణ ప్రాంతాల్లో విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కోవలో నూజి వీడులోని పెద్ద చెరువు, ముకొల్లుపాడు, బోర వంచ, పొనసానపల్లితో పాటు ముసునూరు, ఆగిరిపల్లి, చాట్రాయి మండలాల్లోని పలు గ్రామాల నుంచి యథేచ్ఛగా మట్టి తోలకాలు జరుగుతున్నాయి. నిత్యం వందలాది ట్రాక్టర్లతో మట్టి తరలిపోతోంది. వాస్తవంగా అనుమతులకు అనుగుణంగా ఈ మట్టి తోలకాలు సాగుతున్నాయా అన్నది ప్రశ్నార్థమే. నూజివీడు పెద్ద చెరువులో భారీగా సాగుతున్న అక్రమ మట్టి తోలకాలపై జిల్లా మైనింగ్ విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో చెరువులో దాదాపు 8 అడుగులకు పైబడి భారీ కందకాలతో మట్టి తోలకాలు చేపట్టడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మట్టి తోలకాలు నిర్వహిస్తున్న ఒక జేసీబీ, ఒక ఎక్స్‌కవేటర్, ఎనిమిది ట్రాక్టర్లను ఘటన స్థలంలోనే నిలిపివేశారు. తమకు అనుమతులు ఉన్నాయని చెబుతున్న నిర్వాహకులు కొలుసు శివ, అచ్చి కాసులులను అనుమతి పత్రాలు చూపించాలని మైనింగ్ విజిలెన్స్ అధికారులు ఆదేశిం చారు. అనంతరం రీజియన్ విజిలెన్స్ స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్‌లు కేవీ రమణ, పీఎస్‌ఎస్ ప్రకాశ్ మాట్లాడుతూ మట్టి తోలకాల అనుమతులపై పూర్తిస్థాయి పరిశీలన చేస్తున్నామని, అసలు అనుమతులు ఉన్నాయా..? అనుమతులకు అను గుణం గానే తవ్వకాలు జరిగాయా..? అనేది పరిశీలిస్తున్నామని, పరిశీలనకు అను గుణంగా ఫైన్‌లు వేస్తామన్నారు. మట్టి తరలిస్తున్న వాహనాలను వీఆర్వో అధీనంలో ఉంచినట్టు వివరించారు. అయితే విజిలెన్స్ అధికారులు వెళ్లిన వెంటనే ఘటనా స్థలంలోనే మట్టిని అన్‌లోడు చేసి ట్రాక్టర్లను తీసుకెళ్లిపోవడం గమనార్హం.
మంత్రి పేరుతో అధికార దుర్వినియోగం..
నూజివీడు నియోజకవర్గంలో చేపడుతున్న మట్టి తోలకాల్లో మంత్రి పేరుతో అధికార దుర్వినియోగం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వైపు మంత్రి కొలుసు మట్టి తోలకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తుండగా మంత్రి అనుచరులుగా చెప్పుకుంటున్న కొందరు, వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలస వచ్చిన కొందరు నాయకులు మంత్రి పేరు వాడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.