ఆగిరిపల్లిలో వివాదాస్పద స్థలం పరిశీలన
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:43 AM
ఆగిరిపల్లిలో సర్వే నంబర్‌లో 83/1లో వివాదాస్పదంగా మారిన స్థలాన్ని బుధవారం నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న పరిశీలించారు.
ఆగిరిపల్లి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఆగిరిపల్లిలో సర్వే నంబర్‌లో 83/1లో వివాదాస్పదంగా మారిన స్థలాన్ని బుధవారం నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న పరిశీలించారు. గ్రామానికి చెందిన మాదల సునీత తన భూమిలో ప్రభుత్వ గయ్యాల భూమి ఉందని రెవెన్యూ అధికారులు తెల పడంపై మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి మంత్రి కొలుసు పార్థసారథిపై ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఈ మేరకు పత్రి కలలో బుధవారం వచ్చిన కథనాలకు సబ్ కలెక్టర్ స్పందించి స్థలాన్ని, ప్రభుత్వ రికార్డులను పరిశీలించారు. సునీతతో మాట్లాడి ఆమె వద్ద ఉన్న పత్రాలను తీసుకుని నూజివీడు కార్యాలయానికి రావాలని సూచించారు. తహసీల్దార్ ప్రసాద్, ఆర్‌ఐ మహమ్మద్ యూనస్, మండల సర్వేయర్ రామకృష్ణ, వీఆర్వో పుష్ప పాల్గొన్నారు. కాగా సాయంత్రం సునీత అనా రోగ్యానికి గురి కావడంతో బంధువులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.