Share News

లేబర్‌ అడ్డా

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:48 AM

ఉపాధి కోసం రోడ్లపైనే ఎదురుచూసే కార్మికులకు కూటమి ప్రభుత్వం భరోసానిచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇంటిగ్రేటెట్‌ లేబర్‌ ఎమినిటిస్‌ సెంటర్‌ (ఐలాక్‌) పేరిట ప్రత్యేకంగా లేబర్‌ అడ్డాలను ఏర్పాటు చేయనుంది.

లేబర్‌ అడ్డా

మూడు నెలల్లో అందుబాటులోకి..

1.28 లక్షల మందికి ప్రయోజనం

ఉపాధి కోసం రోడ్లపైనే ఎదురుచూసే కార్మికులకు కూటమి ప్రభుత్వం భరోసానిచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇంటిగ్రేటెట్‌ లేబర్‌ ఎమినిటిస్‌ సెంటర్‌ (ఐలాక్‌) పేరిట ప్రత్యేకంగా లేబర్‌ అడ్డాలను ఏర్పాటు చేయనుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు జూట్‌మిల్లు సెంటర్‌, తాడేపల్లిగూడెం నల్లజర్ల రోడ్డులో వీటి ఏర్పాటుకు కార్మిక శాఖ ప్రతిపాదించింది. దీనికి మునిసిపల్‌ అధికారులు ఎన్‌వోసీలు ఇవ్వాలి. అన్ని అనుకూలిస్తే కార్మికులకు మూడు నెలల్లో లేబర్‌ అడ్డాలు అందుబాటులోకి వస్తాయి.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ప్రధానంగా వివిధ వర్గాల భవన నిర్మాణ, ఇతర రంగాల కార్మికులు ఉపాధి పనుల కోసం రోడ్లను, వివిధ ప్రధాన కూడళ్లను ఆశ్రయించి.. గంటల తరబడి రోడ్ల పైనే పడికాపులు కాస్తుంటారు. ఏళ్ల తరబడి వారు కనీ సం కూర్చోవడానికి అవకాశం లేకుండా ఉదయం ఆరు నుంచి 10 గంటల వరకు అదేపనిగా పనికోసం తాపత్ర య పడుతుంటారు. పని వుంటే వెళ్తారు.. లేక పోతే ఉసురుమంటూ ఇంటిదారి పడతారు. ఇక ఇబ్బంది లేకుండా ఈ లేబర్‌ అడ్డాలో ఉదయం కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకోవడంతోపాటు ఇతర వసతి సౌకర్యా లు కల్పిస్తారు. రిజిస్ర్టేషన్‌ చేసుకునే ప్రతి కార్మి కుడికి ప్రభుత్వ పథకాలపై అవ గాహన కల్పించడం, వాటి ఫలాలు అందేలా సభ్యత్వం ఇప్పిస్తారు. కూలీల కష్టార్జితం దోచుకునే దళారులకు సైతం అడ్డుకట్ట పడనుంది. కార్మికులు పనుల కోసం కూడళ్ల వద్ద ఇకపై ఎదురు చూడా ల్సిన పని లేకుండా లేబర్‌ అడ్డాలకు చేరుకుని సిబ్బంది సహకారంతో ఏ రంగంలో పనిచేయగలరో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలి. యజమానులు కూలీల కోసం ఇక్కడ సిబ్బందిని సంప్రదిం చాలి. ఏ పనిమీద ఎంత కూలి ఇచ్చి.. కూలీ లను తీసుకెళ్లారనే సమాచారాన్ని సిబ్బంది నమోదు చేసుకుంటారు. పని దొరికే వరకు వేచి ఉండేందుకు ఏసీ వెయిటింగ్‌ హాల్‌, తాగునీరు, మరుగుదొడ్లు, ఇలా ప్రశాంత వాతావరణం ఉండేలా సౌకర్యాలు కల్పిస్తారు.

ఐలాక్‌ సెంటర్‌లో అన్ని సౌకర్యాలు

ప్రధాన కూడలిలో ఐలాక్‌ ఉంటుంది. కార్మికులు కూర్చోవడానికి సౌకర్యాలు, బయో టాయిలెట్లు, భవన నిర్మాణ కార్మికులకు ఈ శ్రమ్‌ కార్డుల జారీ చేస్తారు. రిజిస్ర్టేషన్‌కు ముగ్గురు సిబ్బంది పనిచేసేలా చర్యలు తీసు కోనున్నారు. కార్మికులకు ఇవి ఫెసిలిటేషన్‌ సెంటర్‌గా ఉపయోగపడతాయి. ఇదివరకు ఉన్న విధంగా రిజిస్ర్టేషన్‌ చలానా చెల్లింపుల కు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యూపీఐ ద్వారా లావాదేవీలను చేయొచ్చు.

నాలుగు పథకాల్లో సత్వర లబ్ధి

భవన నిర్మాణ, ఇతర రంగ కార్మికుడిగా రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలి. ఫీజు రూ.50తోపాటు ఏడాదికి కార్మిక ఇన్సూరెన్స్‌ ఐదేళ్లకు రూ.60 కలిపి రూ.110 కట్టి లేబర్‌ అడ్డా కింద నమోదు చేయించుకోవాలి. అప్పుడు కార్మికురాడిగా గుర్తింపు కార్డు అందిస్తారు. వీరికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్డింగ్‌, ఇతర నిర్మాణ వర్కర్సు బోర్డు కింద నాలుగు కీలక పథకాలను వర్తింపజేస్తారు. తొలుత కార్మికుడి కుటుంబంలో ఆడపిల్ల పెళ్లికి రూ.20 వేలు గిఫ్ట్‌ అందిస్తారు. ఇద్దరు ఆడపిల్లల వరకు వారి కాన్పులకయ్యే ప్రసూతి సాయం కింద రూ.20 వేలు ఇస్తారు. మహిళా కార్మికురాలికి ఈ రెండు సాయాలు అందిస్తారు. కార్మికుడు సహజ మరణం చెందితే రూ.60 వేల ఆర్థిక సాయం అందిస్తారు. మరోవైపు కార్మికుడు చనిపోతే దహన సంస్కారాలకు రూ.20 వేలు కార్మిక శాఖ నుంచి తక్షణ సాయంగా కుటుంబ సభ్యులకు అందిస్తారు.

కార్మికులకు అన్ని విధాలా మేలు

భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు సత్వరం మేలు చేసేందుకు లేబర్‌ అడ్డాలు ఉపయోగపడ తాయి. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తాం. అన్ని కార్మిక సంఘాలు కార్మికు లకు ఈ పథకంపై అవ గాహన కల్పించి నమోద య్యేలా చూడాలి. కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా అందించే నాలుగు పథకాలు కార్మికులకు ఎంతోగానో ఉపయోగపడతాయి.

– ఎ.గణేశన్‌, జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌

Updated Date - Jul 30 , 2026 | 12:48 AM