Share News

అభివృద్ధి..సంక్షేమం రెండు కళ్లు

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:33 AM

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తవడంతో నియోజకవర్గాల వారీగా మన నమ్మకం– అభివృద్ధి.. సంక్షేమం పేరుతో విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు.. గురువారం పాలకొల్లు, ఉండి, ఆచంట నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అభివృద్ధి..సంక్షేమం రెండు కళ్లు
రిక్షా తొక్కుతూ సభా ప్రాంగణానికి వస్తున్న మంత్రి నిమ్మల.. మోటార్‌ సైకిల్‌ ర్యాలీలో పాల్గొన్న మంతెన రామరాజు, కూటమి పార్టీ నాయకులు

మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు, ఆచంట, ఉండి నియోజకవర్గాల్లో కూటమి విజయోత్సవ సభలు

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తవడంతో నియోజకవర్గాల వారీగా మన నమ్మకం– అభివృద్ధి.. సంక్షేమం పేరుతో విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు.. గురువారం పాలకొల్లు, ఉండి, ఆచంట నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పాలకొల్లు అర్బన్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం రక్షణ కవచంగా నిలబడిందని, వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గాడిలో పెట్టారని మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు. గురువారం పాలకొల్లులో మన నమ్మకం– అభివృద్ధి.. సంక్షేమం కార్యక్రమం నిర్వహించారు. పూలపల్లి సెంటర్లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు. మంత్రి నిమ్మల ప్లాట్‌ రిక్షా తొక్కుతూ సభా ప్రాంగణానికి వచ్చారు. సభలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన కొనసాగుతోందన్నారు. ప్రతిపక్ష హోదాలేని గొడ్డలి పార్టీ చేస్తున్న విమర్శలను ప్రజలే తిప్పికొట్టాలన్నారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన పాలకొల్లు నియోజక వర్గ ప్రజలకే సేవ చేయడమే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నాని మంత్రి నిమ్మల వివరించారు. రెండేళ్ల పాలనలో నియోజకవర్గానికి రూ.986 కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ది పరుసున్నట్టు నిమ్మల తెలిపారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ అభివృద్దే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడం, కులాల మధ్య చిచ్చు పెట్టాలని గొడ్డలి పార్టీ చూస్తోందని కూటమి నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండా లని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికల పూడి గోవిందరావు, నాయకులు కర్నేన గౌరు నాయుడు, పెచ్చెట్టి బాబు, ఉన్నమట్ల కపర్ధి తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కూటమిదే

డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు

ఉండి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి):ప్రజల నమ్మకాన్ని, ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం ఉండి కోట్ల పంక్షన్‌ హాలులో కూటమి విజయోత్సవ సభ నిర్వహించారు. రఘురామ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వనివి కూడా రెండేళ్లలోనే ప్రజలకు చేసి చూపించిన ఘనత తమదేనన్నారు.కోట్లాది రూపాయలతో ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు తన సొంత నిధులు, దాతల సహకారంతో చేస్తున్న అభివృద్ధి పనులు అమోఘమన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమన్నారు. రాష్ట్ర క్షత్రియ కార్పోరేషన్‌ చైర్మన్‌ వేగేశ్న కనకరాజుసూరి మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి మరెక్కడా జరగదన్నారు. భూపతిరాజు వర్మ, కరిమెరక నాగరాజు, మోటుపల్లి ప్రసాద్‌, కొత్తపల్లి నాగరాజు, తాతపండు, వెంకటేశ్వరరావు, కోపల్లె సాయిబాబు, ఎరుబండి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో ముందుకు

ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ

పెనుమంట్ర, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి):నమ్మకం, అభివృద్ధి, సంక్షేమంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. గురువారం మండలంలోని మార్టేరులో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవ సభ నిర్వహించారు. ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధి చూపించడంలో కూటమి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం ఏర్పడిందన్నారు. వైసీపీ ప్రభుత్వం తట్ట మట్టి కూడా వేయకుండా రోడ్లను నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అభివృద్ధి చేశారన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ప్రజలు ఆశీర్వదించాలన్నారు. మహిళలను కించపరిస్తే రాజకీయ భవిష్యత్తు శూన్యమన్నారు. ఏఎంసీ చైర్మన్‌లు బడేటి బ్రహ్మాజీ, కేతా సత్యవతి మీరయ్య, ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి, జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తమనంపూడి శ్రీనివాసరెడ్డి, కోయ కార్తీక్‌, నరసింహమూర్తి, రాంబాబు, తమ్మినీడి ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 12:33 AM