Share News

కౌశలం..ఉద్యోగ యోగం!

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:47 AM

పదోతరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇతర కోర్సుల చదివి నిరుద్యోగులుగా సతమతం అవుతున్న యువతీ యువకులకు కౌశలం పథకంలో ఉద్యోగాల కల్పన దిశగా కూటమి సర్కార్‌ అడుగులు వేస్తోంది.

కౌశలం..ఉద్యోగ యోగం!

యువతకు కూటమి ప్రభుత్వం భరోసా

గతేడాది వర్క్‌ఫ్రంహోమ్‌ సర్వే

జిల్లాలో 9,484 మంది యువతకు చిరుద్యోగాలు లక్ష్యం

ఇటీవలే 118 మందికి ఉద్యోగాల కల్పన

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

పదోతరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇతర కోర్సుల చదివి నిరుద్యోగులుగా సతమతం అవుతున్న యువతీ యువకులకు కౌశలం పథకంలో ఉద్యోగాల కల్పన దిశగా కూటమి సర్కార్‌ అడుగులు వేస్తోంది. గతేడాది చేసిన వర్క్‌ ఫ్రమ్‌ హోం సర్వేకు మోక్షం కలిగించే దిశగా ఉద్యోగార్థుల ఎంపికలను స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల వేదికగా రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో 118 మంది నిరుద్యోగులకు ఇటీవలే ఉద్యోగాలను యంత్రాంగం కల్పించింది.

జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువతీ యువకులు వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిం చడానికి దశలవారీగా ప్రైవేట్‌ సెక్టార్‌లోనే వివిధ అర్హతలు కలిగిన నైపుణ్యం, నైపుణ్యం లేని వివిధ వర్గాలుగా విభజన చేపట్టింది. సంవత్సరంన్నర క్రితం 605 సచివాలయాల పరిధిలో ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉన్న యువతీ, యువకులను సర్వే చేయ గా జిల్లాలో 9,484 మంది నిరుద్యోగులు ఆయా సచివాలయాల్లో నమోదయ్యారు.

కౌశలం అసెస్‌మెంట్‌ టెస్ట్‌లు

చదువు పూర్తి చేసుకున్న యువత సచివాలయాల్లో వారి అర్హతల ప్రకారం కౌశలం పథకం ఉద్యోగాల కోసం అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (సామర్థ్య పరీక్ష)ను రిజి స్ర్టేషన్‌ చేయించుకుంటారు. ఆయా సచివాలయాల పరిధిలో డిజిటల్‌ అసిస్టెంట్‌ల వద్ద అర్హతా పత్రాలను సమర్పించి రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలి. టెస్ట్‌ల నిర్వహణకు అభ్యర్థికి ప్రత్యేక ఫోన్‌ లేదా మెసెజ్‌ ద్వారా అసెస్‌మెంట్‌ టెస్ట్‌ హాజరు కావాలని కోరతారు. వారు చేసిన కోర్సు ఆధారంగా పరీక్ష పెడతారు. ఇందులో 50 మార్కులు వారి సబ్జెక్టుపై, 25 మార్కు లు కమ్యూనికేషన్‌ స్కిల్‌, 25 మార్కులు ఆపిట్యూట్‌ టెస్ట్‌ (రీజనింగ్‌,పోటీ పరీక్షల్లోని మాదిరి)గా నిర్వహి స్తారు. ఉత్తీర్ణత ఆధారంగా

వివిధ కంపెనీల్లో ఎంపికలకు సిద్ధం చేస్తారు. టెస్ట్‌లో ఫెయిల్‌ అయిన వారికి మళ్లీ రీ అసెసెమెంట్‌ టెస్ట్‌ ద్వారా వారి సామర్థ్యంను పెంచుతారు.

118 మందికి ఉద్యోగాలు

జిల్లా స్వర్ణ గ్రామ,వార్డు సచివాలయశాఖ ఆధ్వర్యంలో ఈనెల 12న ఏలూరులో తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన గ్రీన్‌లైన్‌ ఎలక్ర్టికల్‌ కంపెనీ ఉద్యోగార్థుల కోసం ఎంపికలు నిర్వహించగా 250కు పైగా యువతీ యవకులు హాజరయ్యారు. ఇందులో 118 మందిని కంపెనీ ఎంపిక చేసుకుంది. కనీసంగా రూ.15 వేల నుంచి రూ.16,500 వేతనం, భోజన,వసతి సౌకర్యాలు కల్పించనుంది. ఈ నెలాఖరు నాటికి ఎంపికైనవారు ఉద్యోగాల్లో చేరనున్నారు.

ఇదొక బృహత్తర పథకం

జి.వెంకటనాయుడు, జిల్లా స్వర్ణ సచివాలయాల అధికారి

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రైవేట్‌ సెక్టారులో ఉద్యోగాల కల్పనకు ఏపీ ప్రభుత్వం కౌశలం పఽథకం తీసుకొచ్చింది. సచివాలయాల్లో నిరుద్యోగులు తమ అర్హతా పత్రాలను నమోదు చేసుకుంటే ఉద్యోగ అవకాశాలను మేమే కల్పిస్తాం. ఈ అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా నిరు ద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

Updated Date - Sep 27 , 2026 | 12:47 AM