Share News

కోండ్రుకోట పంచాయతీని యధావిధిగా కొనసాగించాలి

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:48 PM

తమ గ్రామ పంచాయతీని యధావిధిగా కొనసాగించాలని కోండ్రుకోట పునరావాస కాలనీకి చెందిన గిరిజనులు శనివారం ఆందోళన చేశారు.

కోండ్రుకోట పంచాయతీని యధావిధిగా కొనసాగించాలి
ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

గ్రామస్థుల ఆందోళన.. అధికారులకు వినతి

పోలవరం, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి):తమ గ్రామ పంచాయతీని యధావిధిగా కొనసాగించాలని కోండ్రుకోట పునరావాస కాలనీకి చెందిన గిరిజనులు శనివారం ఆందోళన చేశారు. పోలవరం తహసీల్దారు బి.సాయి రాజుకు, ఎంపీడీవో చెరుకూరి శ్రీనివాస్‌బాబుకు వినతి పత్రాలు అందజేశారు. మాజీ ఎంపీటీసీ మిడియం వెంకటస్వామి, పూనెం విష్ణు, పూనెం బుచ్చిబాబు తదితరులు మాట్లాడుతూ ముంపు గ్రామాల నుంచి పునరావాస గ్రామాలకు వచ్చిన తర్వాత తమ పంచా యతీ ఓటర్లను సమీప ఎల్‌ఎన్‌డీ పేట పంచాయతీలో కలిపివేశారని, అలా చేయడం వల్ల గిరిజనుల అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌ఎన్‌డీ పేట పంచాయతీలో 99 శాతం గిరిజనేతరులు ఉన్నారని ఇప్పటికే ఆ గ్రామస్థులు తమ పంచాయతీని గిరిజనేతర పంచాయతీగా ఏర్పాటు చేయాలని గత రెండు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించడమే గాక హైకోర్టుని ఆశ్రయించారన్నారు. తమ పంచాయతీని యఽథావిఽధిగా కొనసాగించాలని కోరారు.

Updated Date - Apr 18 , 2026 | 11:48 PM