Share News

కొండంగి ఎత్తిపోతలు పునఃప్రారంభం

ABN , Publish Date - Aug 22 , 2026 | 01:21 AM

ఆరు నెలల కిందట నిలిపి వేసిన కొండంగి 1, 2 ఎత్తిపోతల పథకాలను శుక్రవారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ పునః ప్రారంభించారు.

కొండంగి ఎత్తిపోతలు పునఃప్రారంభం
కొండంగి ఎత్తిపోతల పథకాలను పునః ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌

కలిదిండి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి):ఆరు నెలల కిందట నిలిపి వేసిన కొండంగి 1, 2 ఎత్తిపోతల పథకాలను శుక్రవారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 20 వేల ఎకరాల భూములు సాగులోకి వస్తాయని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ అన్నారు. గోదావరి వరద నీటిని ఉప్పుటేరులోకి మళ్లించి ఉప్పునీటి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఎత్తిపోతల నుంచి ప్రవహించే ఉప్పుటేరులో తీపినీరును లంక గ్రామాలతో పాటు గుర్వాయిపాలెం, కలిదిండి, పడమటిపాలెం, సానారుద్ర వరం, కోరుకొల్లు వరకు సీబీ.కెనాల్‌ ద్వారా అందిస్తాం. ఆక్వా రైతు లు ఎత్తిపోతల ద్వారా అందించే నీటిని సద్వినియోగం చేసుకోవా’ లన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వల్లభనేని శ్రీనివాస్‌ చౌదరి, మాజీ మండల అధ్యక్షుడు జోగిరాజు, చేపల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాడినాడ బాబు, కోరుకొల్లు, కలిదిండి డీసీ చైర్మన్లు పి.సత్యనారాయణ, ఎం.భోగేశ్వరరావు, ఎత్తిపోతల కమిటీ చైర్మన్‌ సూరిబాబు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అండ్రాజు శ్రీనివాస్‌, లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు డైరెక్టర్‌ చలపతిరావు, టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జి అక్కల వెంకటాచలం, నీటి సంఘాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 01:21 AM