Share News

కొల్లేరు కుదింపుపై వైల్డ్‌ లైఫ్‌ బోర్డు ముందుకు..

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:33 AM

కొల్లే రు అభయారణ్య సరిహద్దుల ప్రతిపాదనపై కేంద్రం నియమించిన సాధికారిత కమిటీ (సీఈసీ) ద్వారా రాబోయే నేషనల్‌ వైల్డ్‌లైఫ్‌ బోర్డు 48వ సమావేశంలో చర్చించేందుకు రాష్ట్ర కేబినెట్‌ సమావేశం మంగళవారం ఆమోదముద్ర వేసింది.

 కొల్లేరు కుదింపుపై వైల్డ్‌ లైఫ్‌ బోర్డు ముందుకు..

ఏలూరు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి):కొల్లే రు అభయారణ్య సరిహద్దుల ప్రతిపాదనపై కేంద్రం నియమించిన సాధికారిత కమిటీ (సీఈసీ) ద్వారా రాబోయే నేషనల్‌ వైల్డ్‌లైఫ్‌ బోర్డు 48వ సమావేశంలో చర్చించేందుకు రాష్ట్ర కేబినెట్‌ సమావేశం మంగళవారం ఆమోదముద్ర వేసింది. కొల్లేరు ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ గతేడాది పెద్ద సంఖ్యలో తమ వినతులను సీఈసీ ముందు ఉంచారు. కొల్లేరులో అభయారణ్యం పరిధిలో జిరాయితీ, సొసైటీల పరిధిలో భూములను మినహాయించాలని కోరారు. ఈ నేపథ్యంలో కొల్లేరు స్థితిగతులపై చర్చించేందుకు రాష్ట్రస్థాయిలో కీలక అధికారులతో ప్రభుత్వం ఇటీవలే ప్రత్యేక అఽథారిటీని ఏర్పాటు చేసింది. అభయారణ్యంలో 77,136 ఎకరాల విస్తీర్ణంలో వున్న భూముల్లోని జిరాయితీ, డి–ఫారం పట్టాలను భూములను అభయారణ్యం జీవో నుంచి మినహాయించి పేదలకు న్యాయం చేసేలా సీఈసీ ఈ బోర్డులో ప్రతిపాదించనుంది. త్వరలో న్యూఢిల్లీలో జరిగే నేషనల్‌ వైల్డ్‌లైఫ్‌ బోర్డు సమావేశంలో సీఈసీ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించిన ప్రతిపాదనను పెట్టనుంది.

Updated Date - Feb 25 , 2026 | 01:33 AM