Share News

అధికారులు–రైతుల మధ్య వాగ్వాదం

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:19 AM

ఏలూరు రూరల్‌ మండంలో కాంటూరు పరిధిలో లేని చెరువులకు గ్రామస్థులు నీరు తోడుతుంటే ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారని పలువురు కొల్లేరు నాయకులు, పైడి చింత పాడు గ్రామస్థులు తెలిపారు. పైడి చింతలపాడులో సర్వే జరగలేదన్నారు.

అధికారులు–రైతుల మధ్య వాగ్వాదం

అధికారులు–రైతుల మధ్య వాగ్వాదం

ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి) : ఏలూరు రూరల్‌ మండంలో కాంటూరు పరిధిలో లేని చెరువులకు గ్రామస్థులు నీరు తోడుతుంటే ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారని పలువురు కొల్లేరు నాయకులు, పైడి చింత పాడు గ్రామస్థులు తెలిపారు. పైడి చింతలపాడులో సర్వే జరగలేదన్నారు. ఈక్రమంలో అటవీశాఖ అధికారులు కొట్టని భూముల్లో 0.1 కౌంట్‌ వరకు చెరువులో నీళ్ళు పెట్టుకుంటున్నామని పేర్కొన్నారు. సుమారు 330 ఎకరాలులో ఇప్పుడు నీళ్లు పెట్టుకోకపోతే మరో రెండు నెలల్లో నీరు లభ్యమయ్యే పరిస్థితి లేదని వాపోయారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలను తాము అమలు చేయాల్సి ఉందని ఫారెస్ట్‌ అధికారులు చెబుతున్నారన్నారు. తాము మాత్రం నీళ్ళు పెట్టుకుంటామని భీష్మించడంతో, ఫారెస్టు అధికారులు, గ్రామస్థులకు కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.

పోలీసులకు ఫారెస్టు అధికారుల ఫిర్యాదు

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : ఏలూరు రూరల్‌ మండలం పైడిచింతపాడు గ్రామ పరిధిలోని కొల్లేరులో 20 ఎకరాల చేపల చెరువును ఫారెస్టు అధికారులు ధ్వంసం చేశారు. అయితే మళ్ళీ ఆ చెరువుకు ఆ గ్రామస్తులు గట్లను ఏర్పాటు చేసి నీటిని పడుతున్నారని తెలియడంతో ఆదివారం ఫారెస్టు అధికారులు అక్కడికి వెళ్ళారు. పైడిచింతపాడు గ్రామస్థులు ఫారెస్టు అధికారులపై దాడికి పాల్పడి వారి విధులకు ఆటంక పరిచారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ చిక్కా శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్‌ ఎస్‌ఐ వి.నాగబాబు ఆదివారం రాత్రి పైడిచింతపాడు గ్రామస్థులపై కేసు నమోదు చేశారు.

Updated Date - Feb 09 , 2026 | 12:19 AM