కొల్లేరు సమస్య.. తేల్చేద్దాం!
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:55 PM
ఏళ్ల తరబడి వేధిస్తున్న కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. కొల్లేరు సమస్యను ప్రభుత్వ సమస్యగా కేంద్రానికి నివేదికను రాష్ట్రప్రభుత్వం అందజేయనుంది.
కేబినెట్ ఆమోదంతో కేంద్రానికి, సీఈసీకి సుప్రీంకోర్టుకు అందజేయున్న నివేదిక
కొల్లేరుకు ఏటా గోదావరి జలాలు
చొరవ తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం
అటవీశాఖ నుంచి మౌలిక వసతుల కల్పన బాధ్యత తొలగింపు యోచన
కైకలూరు, జనవరి 28(ఆంధ్రజ్యోతి):
ఏళ్ల తరబడి వేధిస్తున్న కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. కొల్లేరు సమస్యను ప్రభుత్వ సమస్యగా కేంద్రానికి నివేదికను రాష్ట్రప్రభుత్వం అందజేయనుంది.
కొల్లేరు ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కొత్త విధా నాలను అవలంభించి ప్రత్యేక నివేదిక తయారు చేస్తోంది. ఇది కొల్లేరు ప్రజలకు మరింత ఊరటనిచ్చే అంశం. గత వైసీపీ ప్రభుత్వంలో కొల్లేరు సమస్యపై స్పందించ కపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కొల్లేరులో 22 వేల ఎకరాలను అభయారణ్య పరిధి నుంచి తప్పించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభు త్వానికి నివేదిక అందించారని అయితే దానిపై తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏ పోరాటం చేయకుండానే గాలికొదిలేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొల్లేరు ప్రజలకు శాశ్వత పరిష్కా రం అందించే దిశగానే పని చేస్తున్నారు. సీఈసీ కమిటీకి అందించే నివేదిక అటవీశాఖ ద్వారా అందించాల్సి వుంది. ఆ నివేదికలను రాష్ట్రప్రభుత్వం నేరుగా పంపిం చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు. సుప్రీంకోర్టుకు కొల్లేరు అంటే సరస్సు మాత్రమే కాదని, అక్కడ పక్షులతోపాటు మనుషులూ జీవిస్తున్నారనేది తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా అడుగులు వేస్తు న్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే ఆ ప్రాం తంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే సంకల్పంతో చేస్తున్న కృషికి ఫలితాలు ఆశించే రీతిలోనే కన్పిస్తున్నాయి. కొల్లేరు సమస్య అంటే ఆ ప్రాంత ప్రజల సమస్యగా కాకుండా కూటమి ప్రభుత్వం సమస్యగా పరిగణనలోకి తీసుకుని శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేసేలా కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంలో సఫల మయ్యారు. నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చిం చి తీర్మానం చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.
కొల్లేరు ప్రజలు పడుతున్న ఇబ్బందులను కమిటీ దృష్టికి తీసుకెళ్లేందుకు వారికి కావాల్సిన మౌలిక వసతు లు రోడ్లు, తాగునీరు, డ్రెయిన్లు, నూతనంగా గృహాలు నిర్మాణం వంటి వాటిని అటవీ శాఖ నుంచి తప్పించి ఆయా రాష్ట్రప్రభుత్వ శాఖలకు అందించాలని కోరుతు న్నారు. ఇదిజరిగితే ప్రజల రవాణా మార్గాలు మరింత పెరుగుతాయి. పోలవరం నుంచి కృష్ణా నదిలోకి వెళుతు న్న నీటిని మార్గమధ్యలో తమ్మి లేరు వద్ద ఓ స్లూయిజ్ ను నిర్మాణం చేసి మిగులు జలాలను కొల్లేరులోకి వచ్చేలా చేస్తారు. దీనికి ముఖ్యమంత్రి సైతం ఆమోదిం చారు. ఇప్పటికే కావాల్సిన చర్యలు అధికారులు చేపడుతున్నారు. ఉప్పు టేరు ఆక్రమణలు తొలగించి ఏటా 15 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్లేలా చేసేందుకు ప్రణాళిక చేస్తున్నారు. ఈ నిర్ణయం అమలైతే కొల్లేరు సరస్సులో ఏటా మంచినీరు ప్రవహించడంతో భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉండడమే గాకుండా మత్స్యసంపద పుష్కలంగా పెరుగుతుంది. దీంతో కొల్లేరు ప్రజలు సంప్రదాయ వేట చేసుకునేందుకు అనువుగా ఉంటుంది. 2014లో చేసిన తీర్మానం అమలు చేసేందుకు మరొకసారి సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ నిర్ణయాలపై కూటమి ప్రభుత్వం సానుకూల దృక్పఽథంతో ఉండడంతో కొల్లేరు ప్రజలు మేలు జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
శాశ్వత పరిష్కారం దిశగా..
ఎమ్మెల్యే కామినేని
కైకలూరు, జనవరి 28 (ఆంధ్ర జ్యోతి): కొల్లేరు సమస్యను రాష్ట్ర ప్రభుత్వ సమస్యగా కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నట్లు కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. కొల్లేటికోటలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొల్లేరు సమస్యను సీఎం చంద్ర బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పరిష్కరించేం దుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, కొల్లేరుకు శాశ్వత పరిష్కార దిశగానే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. కొల్లేరు సమ స్యను రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి, సీఈసీ కమిటీకి, సుప్రీంకోర్టుకు నివేదిక అందజేస్తోందన్నారు. అటవీ శాఖ ద్వారా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీం కోర్టులో ఇక్కడ ప్రజల ఇబ్బందులను తెలిపి సాను కూలంగా నిర్ణయం వచ్చేలా ప్రయత్నం చేస్తున్నా మన్నారు. ఆయా కమిటీలకు అందించే నివేదికలను ముందుగా మంత్రి వర్గం సమావేశంలో తీర్మానం చేస్తారన్నారు. నివేదికలో కొల్లేరు గ్రామాలకు కల్పిస్తున్న మౌలిక వసతులను అటవీ శాఖ పరిధిలో నుంచి తొల గించి ఆయా ప్రభుత్వ శాఖలకు చెందేలా క్యాబినెట్‌లో తీర్మానం చేస్తారన్నారు.