కొల్లేరుకు కొత్తకళ
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:46 PM
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సు విదేశీ వలస పక్షులకు ఆలవాలం. ఇప్పటివరకు ఈ పక్షుల కేంద్రం అభివృద్ధికి అరకొరగా ప్రభుత్వం నిధులే తప్ప బయట నుంచి ఏ సంస్థ వీటివైపు కన్నెత్తి చూడలేదు. ఏటా పక్షులు శీతాకాలంలో కొల్లే రుకు విడిదికి వస్తాయని తెలిసి రాష్ట్ర బ్రాంచి ఐసీఐసీఐ బ్యాంక్ కార్యాలయం రూ.50 లక్షలతో పక్షుల ఆవాస కేంద్రాలకు ఐరన్ స్టాండ్లను స్వ చ్ఛందంగా తయారుచేసి అందించారు.
రూ.55 లక్షలతో పక్షుల కేంద్రం అభివృద్ధి.. ఐసీఐసీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో 100 కృత్రిమ ఐరన్ స్టాండ్లు ఏర్పాటు
రూ.ఐదు లక్షలతో రహదారిని అభివృద్ధి చేసిన అటవీశాఖ
కైకలూరు, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సు విదేశీ వలస పక్షులకు ఆలవాలం. ఇప్పటివరకు ఈ పక్షుల కేంద్రం అభివృద్ధికి అరకొరగా ప్రభుత్వం నిధులే తప్ప బయట నుంచి ఏ సంస్థ వీటివైపు కన్నెత్తి చూడలేదు. ఏటా పక్షులు శీతాకాలంలో కొల్లే రుకు విడిదికి వస్తాయని తెలిసి రాష్ట్ర బ్రాంచి ఐసీఐసీఐ బ్యాంక్ కార్యాలయం రూ.50 లక్షలతో పక్షుల ఆవాస కేంద్రాలకు ఐరన్ స్టాండ్లను స్వ చ్ఛందంగా తయారుచేసి అందించారు. అటవీ శాఖ అధికారులతో చర్చించి కొల్లేరులో ప్రధా నంగా ఐరన్ స్టాండ్లను కావాలని గుర్తించారు. ఎలాంటి నగదు అటవీశాఖ అధికారులకు ఇవ్వ కుండా బ్యాంక్ ద్వారానే వాటిని తయారు చేయించి కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రంలో 50 స్టాండ్లు, మాధవాపురంలో 50 స్టాండ్లను స్వచ్ఛందంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో చెట్లు తక్కువగా ఉన్నందున పక్షులు ఆవాసా కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు ఈ కృత్రిమ ఐరన్ స్టాండ్లు ఉపయోగ పడుతున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. అటవీశాఖ అధికారు లు పూర్తి సహకారం అందించి ఎక్కడెక్కడ స్టాండ్లు అవసరమో గుర్తించి ఆ స్థలాన్ని చూపించడంతో అవసరమైన ప్రాంతాల్లో స్టాండ్లను నిర్మాణం చేశారు. పర్యావరణ విద్యా కేంద్రం వద్ద సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశా రు. కరెంటు లేకపోయినా సోలార్ పై పర్యా వరణ విద్యాకేంద్రానికి పూర్తిగా ఈ సోలార్ ద్వారా పవర్ అందించే స్థాయిలో వాటి నిర్మాణాన్ని బ్యాంక్ అధికారు లు చేశారు. ఇప్పటి వరకు ఏ సంస్థ ముందుకు రాని విధంగా ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులు ముందుకు రావడం పట్ల పర్యా వరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.ఐదు లక్షలతో వసతుల కల్పన
ఏటా కొల్లేరుకు వచ్చే వరదలతో పక్షుల కేంద్రంలోని పర్యావరణ విద్యాకేంద్రానికి వెళ్లే రహదారి గట్లు కరిగి ప్రమాదభరితంగా మారా యి. అటవీశాఖ అధికారులు గట్లను పటిష్టం చేసేందుకు రూ.ఐదు లక్షల నిధులను కేటా యించారు. సుమారు 700 మీటర్ల పొడవునా నీటి అలల తాకిడికి గట్టు కరగకుండా ఉండేం దుకు తడికలతో అడ్డుపెట్టి బయట నుంచి ట్రాక్టర్లతో బుసకతో గట్లను పటిష్టం చేయడమే గాక గట్టు పొడవునా గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేశారు. దీంతో పర్యాటకులు స్వేచ్ఛగా గట్టు వెంబడి వెళ్లేందుకు వీలు కలిగింది. పర్యావరణ విద్యాకేంద్రంలో మంచినీటి ఆర్వో సిస్టమ్‌ను ఏర్పాటుచేసి పర్యాటకులు ఉచితంగా మంచి నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్న ట్టు డిప్యూటీ రేంజర్ రంజిత్‌కుమార్ తెలిపారు.