Share News

నీటిపై సవారీ!

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:31 AM

మురసు తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కొల్లేరులోకి భారీగా వరద నీరు చేరడంతో గోకర్ణ పురం–పైడిచింతపాడు రోడ్డు ముంపు బారిన పడింది.

నీటిపై సవారీ!
ముంపునకు గురైన గోకర్ణపురం–పైడిచింతపాడు రోడ్డు

కొల్లేరు వరద ముంపులో గోకర్ణపురం–పైడిచింతపాడు రోడ్డు

నీటిలోనే రాకపోకలు.. వాహనదారుల ఇబ్బందులు

పూర్తిస్థాయి రోడ్డు నిర్మాణానికి అడ్డుగా అటవీ శాఖ ఆంక్షలు

కైకలూరు, నవంబరు 23 (ఆంధ్ర జ్యోతి): మురసు తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కొల్లేరులోకి భారీగా వరద నీరు చేరడంతో గోకర్ణ పురం–పైడిచింతపాడు రోడ్డు ముంపు బారిన పడింది. అరకొరగా ఉన్న రహ దారిపై నిత్యం విద్యార్థులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రహదారి అభివృద్ధి చేద్దామని నాయకులు భావిం చినా కొల్లేరు అభయారణ్య పరిధిలో ఉండడంతో అటవీశాఖ అధికారుల ఆంక్షలకు పూర్తిస్థాయిలో పటిష్ఠమైన రహదారి నిర్మాణం జరగడం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. ఏటా కొల్లేరు ముంపులో ఈ రహదారి కలిసిపోతోంది. రహదారిపై పెద్దపెద్దగోతులు ఏర్పడి కోతకు గురవుతోంది. ముంపులో నానిపోవడం వల్ల ద్విచక్ర వాహనదారులు బిక్కు బిక్కుమంటూ ఈ రోడ్డుపై రాకపోక లను సాగిస్తున్నారు. రోడ్డు వెంబడి విద్యుత్‌ లైట్లు లేకపోవడంతో రాత్రి సమయాల్లో ముంపునకు గురైన రహదారిలో వాహనాలు నీట మునిగి మొరాయిస్తున్నాయి. దీంతో ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజా అవ సరాలను దృష్టిలో పెట్టుకుని అటవీ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో రహ దారి నిర్మాణానికి అనుమతినివ్వాలని కోరుతున్నారు.

Updated Date - Nov 24 , 2026 | 12:31 AM