అబ్బయ్య చౌదరీ.. మా సొమ్ము చెల్లించు
ABN , Publish Date - Jul 28 , 2026 | 01:07 AM
వైసీపీకి చెందిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మా చెరువులకు సంబంధించిన కౌలు సొమ్ము మింగేశాడు.. ఆ సొమ్ము ఇచ్చేవరకు నిరసన తెలుపుతూనే ఉంటా మని కొల్లేటి గ్రామాలైన శ్రీపర్రు, కోమటిలంక గ్రామాల ప్రజలు సోమవారం పెదవేగి మండలం రాయన్నపాలెంలో కంచాలు మోగిస్తూ నిరసన తెలి పారు.
రాయన్నపాలెంలో శ్రీపర్రు, కోమటిలంక గ్రామస్థుల ధర్నా
పెదవేగి, జూలై 27(ఆంధ్రజ్యోతి):వైసీపీకి చెందిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మా చెరువులకు సంబంధించిన కౌలు సొమ్ము మింగేశాడు.. ఆ సొమ్ము ఇచ్చేవరకు నిరసన తెలుపుతూనే ఉంటా మని కొల్లేటి గ్రామాలైన శ్రీపర్రు, కోమటిలంక గ్రామాల ప్రజలు సోమవారం పెదవేగి మండలం రాయన్నపాలెంలో కంచాలు మోగిస్తూ నిరసన తెలి పారు. అబ్బయ్యచౌదరి స్వగ్రామమైన కొండలరావుపాలేంలోని ఆయన నివాసం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తుండగా రాయన్నపాలెం లోనే పోలీ సులు వారిని అడ్డుకోవడంతో అక్కడే నిరసనకు దిగారు. వైసీపీ పాలనలో రెండు గ్రామాలకు చెందిన 250 ఎకరాల్లోని చేపల చెరువులకు సంబంధించి రూ.8కోట్ల మేర కౌలు సొమ్ము కొఠారు మింగేశాడన్నారు., మాకు రావాల్సిన సొమ్ము ఇవ్వకుండా విదేశాల్లో జల్సా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.