Share News

కొల్లేరుపై సీఈసీకి నివేదిక

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:03 AM

కొల్లేరు పక్షుల అభయారణ్యంపై సుప్రీం నియమిత సాధికారి కమిటీ కోరిన అంశాలపై తుది సమాచారాన్ని జిల్లా యంత్రాంగం రూపొం దించిందని, ఈ నెల 7న రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సమర్పిస్తుందని కలెక్టర్‌ కె.వెట్రి సెల్వి తెలిపారు.

   కొల్లేరుపై సీఈసీకి నివేదిక
కొల్లేరు మ్యాప్‌లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్‌ గౌడ

కలెక్టర్‌ వెట్రిసెల్వి

ఏలూరు,అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): కొల్లేరు పక్షుల అభయారణ్యంపై సుప్రీం నియమిత సాధికారి కమిటీ కోరిన అంశాలపై తుది సమాచారాన్ని జిల్లా యంత్రాంగం రూపొం దించిందని, ఈ నెల 7న రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సమర్పిస్తుందని కలెక్టర్‌ కె.వెట్రి సెల్వి తెలిపారు. కొల్లేరు ఐదో కాంటూరు కుదింపు పరిధిలోని సరిహద్దుల హేతబద్ధీ కరణ, జిరాయితీ, డి –ఫారం భూమిదారులకు పునరావాసం తదితర అన్ని అంశాలపై కలె క్టర్‌ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్‌ గౌడ అధికారు లతో కలిసి మంగళవారం మరోమారు మ్యాపుల ద్వారా పరిశీలన చేపట్టారు. మండ లాలవారీగా జిరాయితీదారుల తర లింపు, ప్రభుత్వ భూములు, ఉప్పుటేరు ప్రక్షాళన, అభయారణ్య పరిఽధిలో నోటిఫైడ్‌, నాన్‌ నోటి ఫైడ్‌ డ్రెయిన్లు వంటి అంశాలపై సీఈసీకి నివేదికను సిద్ధం చేశారు. ఈ పరిశీలనలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ రెడ్డి, డీఎఫ్‌వో త్రిమూర్తులరెడ్డి, ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ఇన్‌ చార్జి డీఆర్వో ముక్కంటి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ అంబేడ్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:03 AM