ఫ్లడ్‌లైట్ల వెలుగులో కోడిపందేలు
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:18 AM
నూజివీడు నియోజకవర్గం కోడిపందేలు, పేకాట, జూదాలకు నిలయంగా మారింది.
ఆగిరిపల్లి మండలంలో జోరుగా నిర్వహణ
నూజివీడు, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి):నూజివీడు నియోజకవర్గం కోడిపందేలు, పేకాట, జూదాలకు నిలయంగా మారింది. గతేడాది నుంచి నియోజకవర్గంలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసు నూరు మండలాల్లో పలు గ్రామాల్లో ఈ జూదాలు నిత్యం సాగుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. పత్రికల్లో వార్తలు వస్తే పోలీసులు నామమాత్రంగా దాడులు జరిపి చేతులు దులుపుకుంటున్నారు. ఆగిరిపల్లి మండలం కనసన పల్లి, నెక్కలం గొల్లగూడెం శివారులో రోజుకో మామిడితోటలో ఫ్లడ్‌లైట్లు వెలుగుల మధ్య కోడిపందేలు సాగుతున్నాయి. నూజివీడు, గుడివాడ, గన్న వరం, విజయవాడ, ఏలూరు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జూదరులు పాల్గొంటున్నారు. రోజు లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. గురువారం రాత్రి నెక్కలం కనసనపల్లి శివారు లోని ఒక మామిడి తోటలో ఫ్లడ్‌లైట్లు వెలుగుల మధ్య కోడిపందేలు జరిగా యి. గతంలో ఎన్నడూ లేని విధంగా నూజివీడు నియోజకవర్గంలో కోడి పందేలు, పేకాట వంటి జూదాలు నిత్యం సాగుతున్నాయనే ప్రచారం ఉంది.