కోఢీ
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:17 AM
పండుగ తొలిరోజే బుధవారం కోళ్లు కాళ్లు దువ్వాయి. హైటెక్ హంగుల మధ్య పందేలు జోరుగా సాగాయి. బారికేడ్లు, వీఐపీ గ్యాలరీ లు, ఫ్లడ్‌లైట్లు, మైక్ అనౌన్స్‌మెంట్లు, స్టేజీలు వంటి అన్ని వసతులతో ఆర్భాటంగా పందే లను నిర్వహించారు.
జిల్లాలో కత్తులు రువ్విన పుంజులు
పందేలు రూ.30 కోట్లపై మాటే
జోరుగా సాగిన గుండాట, పేకాట
హైటెక్ హంగులు.. సకల సౌకర్యాలు
పలుచోట్ల బహుమతులుగా బైక్‌లు
భారీగా తరలివచ్చిన తెలంగాణవాసులు
ఏలూరు,జనవరి 14(ఆంధ్రజ్యోతి) :
పండుగ తొలిరోజే బుధవారం కోళ్లు కాళ్లు దువ్వాయి. హైటెక్ హంగుల మధ్య పందేలు జోరుగా సాగాయి. బారికేడ్లు, వీఐపీ గ్యాలరీ లు, ఫ్లడ్‌లైట్లు, మైక్ అనౌన్స్‌మెంట్లు, స్టేజీలు వంటి అన్ని వసతులతో ఆర్భాటంగా పందే లను నిర్వహించారు. కొన్నిచోట్ల రాత్రివేళ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పందేలను కొనసాగిం చారు. వారం రోజుల నుంచి హడావుడి చేసిన పోలీస్ యంత్రాంగం మచ్చుకైనా బరుల సమీపంలో కానరాలేదు. జిల్లాలో సుమారు రూ.30 కోట్లు చేతులు మారాయి.
పందెం రాయుళ్లు నేతల అండదండలతో జిల్లాలో బరులు సిద్ధం చేశారు. సంక్రాంతి ముసుగులో కోడిపందెలు, జూదం నిర్వహించ రాదని హెచ్చరికలు జారీ చేసినా అవి కోడి విన్యాసాల ముందు తేలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా కోడి పందేల బరుల వద్ద తెలంగాణ వాసుల సందడి కనిపించింది. వీరిరాకతో జిల్లా వ్యాప్తంగా రూ.ఐదు కోట్ల పైబడే పందేలు అదనంగా జరిగినట్టు చెబుతున్నారు. ప్రతీ పందెం సగ టున రూ.5లక్షల నుంచి 20 లక్షల వరకు కాశారు. జిల్లాలో కోడిపందెల్లో నూజివీడు మండలం మీర్జాపురం బరిదే హైలెట్. తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున కార్లలో ఇక్కడకు చేరుకున్నారు. మంత్రి కొలుసు పార్థసారఽథి లేనపప్పటికి.. ఆయన అనుచరగణమే ఈ పోటీలను వెనుక ఉండి నడిపించినట్టు ప్రచారం సాగుతోంది. ఆరు టెంట్లు వేసి పేకాట శిబిరాలు కొనసాగాయి. కైకలూరు భుజబల పట్నంలో రెండెకరాల స్థలంలో మూడు స్ర్కీన్లు, గ్యాలరీల్లో 500 మంది తిలకించ డానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఫ్లడ్‌లైట్లు ఏర్పాట్లు జరిగా యి. తొలి రోజు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు అత్యధి క పందాలు సాగాయి. దాదాపుగా రూ.రెండు కోట్లు చేతుల మారాయి. ముదినేపల్లి మండలంలో అల్లూరు, పెయ్యేరు, పెదపాలపర్రు, సింగరాయపాలెం– కోరుకల్లు రోడ్లవద్ద పందెలు జరిగాయి. తొలి రోజు రూ.రెండు కోట్ల పైమాటే చేతులు మారాయి. ఎక్కువగా పందెలు గెలిచిన విజేతలకు ఐదుగురుకి బుల్లెట్‌లను అందించారు. కొయ్యలగూడెం రామానుజపురంలో నాలుగు ఎకరాల పామాయిల్ తోటలో కోడిపందేలను నిర్వహించారు. 15 పందెల్లో కనీసంగా 8 గెలిచిన వ్యక్తికి రూ.2.50 లక్షల బుల్లెట్‌ను బహుకరించారు. గవరవరంలో భారీగా పోటీలు జరిగాయి. ఇక్కడ ఎక్కువ పందెలు గెలిచిన మహిళ బుల్లెట్‌ను నూతగ్గి ఆశా జ్యోతి గెలుచుకుంది. లింగపాలెం మండలంలో లింగపాలెం, ములగలంపాడు, కలరాయనగూడెంలో భారీ పందెలు జరి గాయి. రెండు కోట్ల మేర చేతులు మారాయి. ములగలం పాడులో మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ తిలకించారు. చింతల పూడి మండలం తెలంగాణ– ఆంధ్రా బోర్డర్‌లో చింతంపల్లి లో భారీగా జనం తరలించారు. జంగారెడ్డిగూడెం మండ లం శ్రీనివాసపురం భారీ పందెలు సాగాయి. సుమారు రూ.కోటిపైనే చేతులు మారాయి. జిల్లా వ్యాప్తంగా బరులు 150 పైగానే ఏర్పాటు చేశారు. కొల్లేరు లంక గ్రామాల్లోను పందెలు సాగాయి. పెదవేగి మండలం దుగ్గిరాలలో ఎమ్మె ల్యే చింతమనేని ప్రభాకర్, నారాయణపురంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పందేలు ప్రారంభించగా, ఇక్కడే ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తొలుత కొబ్బరి కాయ కొట్టి అనధికారికంగా ప్రారంభించారు. నారాయణ పురంలో జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ దంపతులు తిలకించ డానికి వచ్చారు. కొయ్యలగూడెంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. కాగా పందేలలో పోరాడి చని పోయిన కోళ్లు (కోజా) రూ.నాలుగు వేల నుంచి రూ.15 వేలు పలికాయి.
గుండాట, పేకాటల జోరు
నిర్వాహకులు కోడిపందేలు కంటే అదనంగా గుండాట, పేకాట రూపంలో భారీగా సొమ్ములు మిగులుతుండటంతో వీటిని ఎక్కువగానే ఏర్పాటు చేశారు. నాన్‌వెజ్ వంటకాలు, బెల్టుషాపుల నుంచి మద్యం తెచ్చి విచ్చలవిడిగా రేట్లు పెంచి అమ్మారు.
దారులన్నీ మీర్జాపురానికే..
నూజివీడు/నూజివీడు టౌన్: సంప్రదాయ ముసుగులో కోడి పందేలు యథేచ్ఛగా సాగాయి. నూజివీడు మండలం మీర్జాపురంలో వారధి వారి సంక్రాంతి వేడుకల పేరుతో నిర్వహించిన కోడిపందేలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 20 నుంచి 25 వేల మంది వరకు హాజరైనట్లు అంచనా. హైటెక్ స్థాయిలో స్టేడియంలను తలపిస్తూ సిట్టింగ్ ఏర్పాటు ఏర్పాటు చేయడం సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంతో ఇక్కడకు తరలివచ్చారు. నూజివీడు బిళ్లనపల్లి ప్రధాన రహదారి పందెం రాయుళ్ళు వాహనాలతో జామ్ అయింది. ఖమ్మం జిల్లా అశ్వారావు పేట, ఇల్లందు శాసనసభ్యులు జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయ్‌బాబులు హాజరై పందేలను వీక్షించారు.
తొలి రోజు చేతులు మారిన రూ.10 కోట్లు
మీర్జాపురం బరిలో ప్రధాన పాతిక లక్షల పందేలు మొత్తం 22 నిర్వహించారు. వాటికి అదనంగా సపోర్ట్ పందేలు, కోసాట తదితరాల ద్వారా సాయంత్రం 7గంట ల వరకు సుమారు రూ.10 కోట్లు వరకు చేతులు మారా యని అంచనా. ఫ్లడ్‌లైట్లు 35 ఎంఎం సినిమా థియేటర్ స్ర్కీన్ లను తలపించే ఎల్‌ఈడీ స్ర్కీన్‌లతో తెల్లవార్లు పోటీలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు. ఈ బరి ప్రభావం తో నూజివీడు, ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి మండ లాలలో ఇతర బరులన్ని వెలవెలబోయాయి.