Share News

సాగుకు సన్నద్ధం

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:44 AM

జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.

సాగుకు సన్నద్ధం

ఖరీఫ్‌ ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ

జిల్లాలో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 2,38,080 ఎకరాలు

వరి సాగు విస్తీర్ణం 2,16,655 ఎకరాలు

ఇప్పటికే కాల్వలకు నీరు విడుదల

త్వరలో వర్ష సూచన

నారుమడులకు రైతులు సిద్ధం

ఎరువులు, విత్తనాలు రెడీ

జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రధాన పంట వరి సాగుకు రైతులు, యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కాల్వలకు నీరు విడుదల కావడం, త్వరలో వర్ష సూచన ఉండడంతో ముందస్తు సాగుకు అధికారులు సూచనలు ఇచ్చారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతాయనే అంచనాతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆ మేరకు కింది స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో రైతులను సాగుకు సమాయత్తం చేస్తున్నారు.

(ఏలూరు సిటీ–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. కాల్వలకు నీరు విడుదల, త్వరలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు సాగుకు సన్నద్ధమ వుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని పంటల సాగు విస్తీర్ణం 2,38,080 ఎకరాలు కాగా, జిల్లాలో ప్రధాన పంట వరి సాగు విస్తీర్ణం 2,16,655 ఎకరాలు, మొక్కజొన్న 765 ఎకరాలు, మినుము 7090 ఎకరాలు, వేరుశనగ 3075 ఎకరాలు, పత్తి పంట 7957.5 ఎకరాలు, చెరకు 2292.5 ఎకరాల్లో సాగు చేస్తా రు. ఇతర పంటల సాగు విస్తీర్ణం స్వల్పంగానే ఉన్నాయి. తొల కరి వర్షాలు కురిస్తే సాగుకు రైతులు ఉపక్రమించే అవకాశా లున్నాయి. జిల్లా వ్యవసాయ వరి సాగుకు విత్తనాలను సిద్ధం చేసింది. రైతు నుంచి రైతులు విత్తనాలు తీసుకుని సాగు చేయనున్నారు. ఖరీఫ్‌లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండడంతో ప్రకృతి వ్యవసాయ సాగు చేయాలని జిల్లా యంత్రాంగం సూచిస్తోంది.

వరి సాగు ఇలా..

ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాధారణ విస్తీర్ణం 2,16,655 ఎకరాలు కాగా 1,87,905 ఎకరాలకు సరిపోయేవిధంగా 8945.25 ఎకరాలలో నారుమళ్లు వేయాల్సి ఉంది. మిగిలిన 28,750 ఎకరాల్లో నేరుగా విత్తనాన్ని నాటుతారు. వరి సాగులో విత్త నాల ఎంపిక ప్రధానం. ఖరీఫ్‌ సీజన్‌లో ఎంటీయూ 1318, ఎంటీయూ 7029, పీఎల్‌ఏ 1100, ఎంటీయూ 1224, ఎంటీ యూ 1061, ఎంటీయూ 1064, బీపీటీ 5204 రకం విత్తనాలను సాగు చేస్తున్నారు. ఈ రకాలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ రైతులకు సూచిస్తోంది.

సరిపడా ఎరువులు

జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు పరిపడా ఎరువులను సిద్ధం చేసి నట్లు జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికలో పేర్కొంది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి 1,18402 మెట్రిక్‌ టన్నులు ఎరువులు అవసరమవుతాయని, ఇప్పటికే జిల్లాలో 51,563 మెట్రిక్‌ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఎరువులు వస్తాయని కూడా స్పష్టం చేసింది. యూరియా, పొటాష్‌, అమ్మోనియా, సూపర్‌తో పాటు కాంప్లెక్స్‌ ఎరువులు సాగు అవసరాలకు సరిపడా సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి షేక్‌ హబీబ్‌బాషా తెలిపారు. సాగు అవసరాలకు సరిపడా ఎరువులు సిద్ధం చేస్తామని, రైతులు అధైర్యపడంద్దని ఆయన పేర్కొన్నారు.

5.62 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి లక్ష్యం

జిల్లాలో ఖరీప్‌ సీజన్‌లో వరి సాగులో ఈ ఏడాది 5,62,123 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా. దీనికి తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేశామని జిల్లా వ్యవసాయ శాఖ చెబుతోంది.

Updated Date - Jun 03 , 2026 | 12:44 AM