Share News

సాక్షి సంతకానికి.. మేం చాలు!

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:35 AM

ఏ భూమి రిజి స్ట్రేషన్‌ చేయాలన్నా లేఖరులదే హవా.. వారన్నుకున్న విధంగా అధికారులను ఒప్పించి ఎలాంటి భూము లకైనా రిజిస్ట్రేషన్లు పక్కాగా జరిపిస్తు న్నారు.

సాక్షి సంతకానికి.. మేం చాలు!
కైకలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

కైకలూరు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో లేఖరులదే హవా

అనేక రిజిస్ట్రేషన్లలో సాక్షులుగా లేఖరులే సంతకాలు

ములకలపల్లి అక్రమ రిజిస్ట్రేషన్‌లోనూ ఇదే తంతు

కైకలూరు, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి):ఏ భూమి రిజి స్ట్రేషన్‌ చేయాలన్నా లేఖరులదే హవా.. వారన్నుకున్న విధంగా అధికారులను ఒప్పించి ఎలాంటి భూము లకైనా రిజిస్ట్రేషన్లు పక్కాగా జరిపిస్తు న్నారు. రిజిస్ట్రేష న్‌కు సంబంధించిన పర్సంటేజ్‌ను క్రయదారులకు, అధికారులుకు మధ్య వారే మధ్యవర్తిత్వం నిర్వహిస్తు న్నారు. ఆన్‌లైన్‌ విధానం అమలులో ఉండడంతో కైక లూరు ప్రాంతంలోనే కాక ఇతర ప్రాంతాల్లోని భూము లను రిజిస్ట్రేషన్‌ చేయడం వీరికి మరింత కలిసి వస్తోంది. అవసరమైతే సాక్షి సంతకాలను నేరుగా డాక్యుమెంట్‌ రైటర్లే పెట్టేస్తున్నారు. ఈ తంతు కైక లూరు సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో నిత్యం జరుగు తూనే ఉంది.

ఇటీవల ముదినేపల్లి మండలం ములకలపల్లిలో అక్రమ పార్టిషన్‌ ఇదేవిధంగా జరిగింది. 2.20 ఎకరాల పొలం ఒక భవనాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించారు. అయి తే ఈ రిజిస్ట్రేషన్‌కి డాక్యుమెంట్‌ రైటర్లే రెండు సాక్షుల సంతకాలను పెట్టారు. భూ యజమాని పేరుతోనే దస్తావేజులు ఉన్నప్పటికీ మిగిలిన డాక్యుమెంట్లు నకిలీవిగా పేర్కొంటున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ముదినేపల్లి పోలీసుస్టేషన్లో కేసు నమోదైన విషయం విదితమే. ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌ 2026 ఫిబ్రవరి 24న జరిగింది. దీనిలో సాక్షులుగా పి.శివ, మాగినేని నాగలక్ష్మీ వీరు డాక్యుమెంట్‌ రైటర్లుగా ఉన్నప్పటికీ సాక్షులుగా సంతకాలు పెట్టారు. ఇలాగే అనేక రిజిస్ట్రేషన్లలో భూ కొనుగోలుదారులు సంబంధించిన వ్యక్తులు అందుబాటులో లేకపోతే రైటర్లే సంతకాలు పెడుతున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌ జరిగిన సమయంలో ఉన్న రిజిస్ట్రార్‌ డి.శివాజీ ప్రస్తుతం డిప్యూటేషన్‌పై ఈనెల 1వ తేదీ నుంచి విజయవాడ ఐజీ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నారు.

Updated Date - Jun 20 , 2026 | 12:35 AM