Share News

సంక్రాంతికైనా.. జీతాలు వచ్చేనా..!

ABN , Publish Date - Jan 09 , 2026 | 12:50 AM

రాష్ట్రం లోని అతిపెద్ద మేజర్‌ పంచాయతీలో ఒకటైన కైకలూరు పంచాయతీలో నిత్యం సమస్యలు వేధిస్తున్నాయి. ఏడు నెలలుగా జీతాలు లేక పోవడంతో పంచాయతీ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సంక్రాంతి కైనా జీతాలు అందుతాయా.. లేదా..? అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 సంక్రాంతికైనా..   జీతాలు వచ్చేనా..!

ఏడు నెలలుగా జీతాలు లేని కైకలూరు పంచాయతీ కార్మికులు

కైకలూరు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లోని అతిపెద్ద మేజర్‌ పంచాయతీలో ఒకటైన కైకలూరు పంచాయతీలో నిత్యం సమస్యలు వేధిస్తున్నాయి. ఏడు నెలలుగా జీతాలు లేక పోవడంతో పంచాయతీ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సంక్రాంతి కైనా జీతాలు అందుతాయా.. లేదా..? అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాలుగేళ్లుగా పం చాయతీలో అవినీతి, అక్ర మాలు రూ.8కోట్లకు పైగా ఉన్నాయని ఉన్నతా ధికారుల విచారణలో వెల్లడవడంతో ఏడుగురు కార్యదర్శులు సస్పెండ్‌ అయ్యారు. సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించడంతో చెక్‌పవర్‌ సమ స్యగా మారింది. ఉన్నతాధికారులు మండల పరిషత్‌ అధికారి, పంచాయతీ కార్యదర్శిలతో జాయింట్‌ చెక్‌ పవర్‌ను ఏర్పాటుచేశారు. పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి లేకపోవ డంతో సమస్య మరింత జఠిలమైంది. సంవత్స రన్నర కాలంగా పారిశుధ్య కార్మికులకు జీతాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. డిసెంబరు 2025 నాటికి ఏడు నెలలు జీతాలు పెండింగ్‌ ఉన్నాయి. వాస్తవానికి ఎనిమిది నెలలు అందా ల్సి ఉండగా ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీని వాస్‌ కార్మికులు పడుతున్న అవస్థలను గుర్తిం చి ఒక నెల జీతాల మొత్తం రూ.8.10 లక్షలను తన సొంత సొమ్మును అందజేశారు. అయినా మరో ఏడు నెలలు జీతాలు బకాయిలు ఉన్నా యి. పారిశుధ్య కార్మికులు, వాటర్‌వర్క్స్‌ సిబ్బం ది, ఎలక్ర్టీషియన్స్‌లు సుమారు 80 మందికి పైగా పనిచేస్తున్నారు. ఇటీవల కైకలూరుకు గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శిగా ఫణి రాజ కుమారి నియమితులయ్యారు. పంచాయతీలో 80మంది కార్మికులకు నెలకు రూ.8.10 లక్షలు చొప్పున జీతాలు చెల్లించాల్సి వుంది. పంచా యతీ నిధుల్లో ప్రస్తుతం మూడు నెలలకు సరిపడా నిధులు ఉన్నప్పటికీ కనీసం ఒక్క నెల జీతం కూడా చెల్లించడం లేదని కార్మికు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రికార్డులు అప్పగించని వైనం..

గతనెల 22వ తేదీన పంచాయతీ కార్య దర్శిగా ఫణిరాజకుమారి విఽధుల్లో చేరారు. అప్పటి వరకు పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన ప్రసాద్‌ నేటికీ చార్జి అప్పగించక పోవడంతో పాలన నిలిచిపోయింది. దీనిపై ఉన్నతాధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే సంక్రాంతి పండుగ కూడా కార్మికులకు జీతాలు అందని పరిస్థితి నెలకొంటుంది. పారిశుధ్య కార్మికుల జీతాలు చెల్లింపులో ఆలస్యం చేయవద్దని తక్షణమే జీతాలు అందించాలని ఎమ్మెల్యే కామినేని గురువారం ఆదేశించారు. గతంలో పనిచేసిన కార్యదర్శి రికార్డులు అప్పగించకపోవడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణం రికార్డులు అప్పగించాలని ఆదేశించారు .

Updated Date - Jan 09 , 2026 | 12:50 AM