Share News

జూట్‌ మిల్లు కార్మికులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:35 AM

విధుల నుంచి తొలగించిన జూట్‌ మిల్లు కార్మికులకు నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని ఎంపీ మహేశ్‌కుమార్‌ యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు.

జూట్‌  మిల్లు కార్మికులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి

జూట్‌ మిల్లు కార్మికులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి

లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ మహేశ్‌

ఏలూరు టూ టౌన్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): విధుల నుంచి తొలగించిన జూట్‌ మిల్లు కార్మికులకు నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని ఎంపీ మహేశ్‌కుమార్‌ యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. జూట్‌ మిల్లులో పని చేసిన 4 వేల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ దుస్థితిని లోక్‌సభలో ఎంపీ మహేశ్‌ ప్రస్తావించారు. ఈఎస్‌ఐ చట్టంలోని అటల్‌ బీమిత్‌ వ్యక్తి కల్యాణ్‌ యోజన కింద కార్మికులు నిరుద్యోగ భృతికి అర్హులని కేంద్ర సమాధానం ఇచ్చిందన్నారు. ఇప్పటి వరకు కొత్తూరు జూట్‌మిల్‌కి చెందిన 200 మంది కార్మికులు మాత్రమే ప్రయోజనం పొందారని, మిగిలిన 3800 కార్మి కులకు తక్షణం నిరుద్యోగ భృతి ఇవ్వాలని యాజమాన్యాన్ని ఆదేశించాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు.

వ్యవసాయ రోడ్డు మ్యాప్‌ తయారుచేయాలి

దేశంలోని అనేక రాష్ర్టాల్లో విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ కోసం ప్రత్యేక రోడ్డు మ్యాప్‌ తయారు చేయాల్సిన అవసరం ఉందని లోక్‌సభలో ఎంపీ మహేశ్‌ కుమార్‌ కేంద్రాన్ని కోరారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రామ్‌నాథ్‌ ఠాగూర్‌ సమాధానం ఇస్తూ ఏపీతో సహా 7 రాష్ర్టాల్లో వ్యవ సాయ రోడ్‌ మ్యాప్‌ల కోసం కార్యాచరణ ప్రణాళికలు ప్రారంభిస్తున్నామన్నారు. రైతుల అవసరాలు పరిగణలోకి తీసుకుని ఆదాయం పెంచడమే రోడ్‌మ్యాప్‌ ముఖ్య ఉద్ధేశమన్నారు.

Updated Date - Aug 06 , 2026 | 12:36 AM