సమస్య వస్తే తల్లిదండ్రులు, టీచర్లకు చెప్పాలి
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:20 AM
ఏదైనా సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా 15100లో న్యాయసేవాధికార సంస్థలను సంప్రదించవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు.
ఏలూరు క్రైం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఏదైనా సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా 15100లో న్యాయసేవాధికార సంస్థలను సంప్రదించవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. గురువారం ఏలూరు హనుమాన్‌నగర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలలో బాలల హక్కులు, పోక్సో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లైంగిక దాడుల నుంచి బాలలను రక్షించడానికి ఈ చట్టాన్ని రూపొందించారన్నారు. ఈ చట్టం ప్రకారం నేరానికి పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు అమలు పరచడం జరుగుతుందన్నారు. బాలలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాధితులకు పరిహారం పొందే అవకాశం ఉందని, విద్యార్థులు మారుతున్న చట్టాలపై ఎప్పటికప్పుడు అవగా హన కలిగి ఉండడం ముఖ్యమన్నారు. మానవ అక్రమ రవాణా, సురక్షితమైన స్పర్శ, భద్రత తదితర చట్టాలపై అవగాహన కలిగించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.