జూనియర్ డాక్టర్ల సమ్మె
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:31 AM
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ ఏలూరు ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్ట ర్లు బుధవారం నుంచి విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు.
వైద్యఆరోగ్యశాఖ అత్యవసరంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఏలూరు క్రైం/ఏలూరు అర్బన్, ఆగస్టు12 (ఆంధ్రజ్యోతి):తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ ఏలూరు ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్ట ర్లు బుధవారం నుంచి విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమ్మె చేపట్టారు. ఈనెల 15వ తేదీ వరకు తాము విధులను బహిష్కరిస్తామని, అప్పటి కూడా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిం చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న 13 మంది జూనియర్ రెసిడెన్స్‌లు (పీజీ విద్యార్థులు) కూడా విధులను బహిష్క రించి సమ్మెలో పాల్గొన్నారు. మరోవైపు సమ్మె ప్రభా వం రోగులకు వైద్యసేవలపై పడకుండా జిల్లా వైద్యఆరోగ్యశాఖ అత్యవసరంగా ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేసింది. వట్లూరు, విజయ రాయి, చాటపర్రు, ధర్మాజీగూడెం, గోపన్న పాలెం, కొల్లేటికోట, చేబ్రోలు, పోతునూరు పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లు, ఏలూరు డీఎం హెచ్‌వో కార్యాలయంలోని టెలీహబ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు వైద్యాధికారులను డిప్యుటే షన్లపై సర్వజన ఆసుపత్రికి తాత్కాలికంగా నియమిస్తూ డీఎంహెచ్‌వో డాక్టర్ యు.శోభ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
సమ్మె కారణంగా ఏలూరు ప్రభుత్వాసుపత్రి కి వచ్చే రోగులకు ఇబ్బందులు లేకుండా చర్య లు చేపట్టడానికి ఆసుపత్రిలో ఉన్న అన్ని విభా గాల హెచ్‌వోడీలతో ప్రభుత్వ సర్వజన ఆసు పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామ ల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వైద్య విధాన పరిషత్ విభాగం నుంచి నలుగురు స్పెషలిస్టు వైద్యులు, వైద్య ఆరోగ్య శాఖ నుంచి 12 మంది వైద్యులు, మరో 10 మంది మెడికల్ కాలేజీ నుంచి అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు, మరో 18 మంది ఫారన్ మెడికల్ గ్రాడ్యుయేట్ సేవలను వినియోగించుకోవడానికి టైమ్‌టేబుల్‌ను కూడా సిద్దం చేశామన్నారు.