గ్రామస్థాయి నుంచి జనసేన బలోపేతమే లక్ష్యం
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:36 AM
:గ్రామస్థాయి నుంచి జనసేన బలో పేతమే లక్ష్యమని ఏలూరు పార్లమెంట్ అబ్జర్వర్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు.
ఏలూరు పార్లమెంట్ అబ్జర్వర్ బత్తుల బలరామకృష్ణ
ఏలూరు రూరల్, జూన్ 29(ఆంధ్రజ్యోతి):గ్రామస్థాయి నుంచి జనసేన బలో పేతమే లక్ష్యమని ఏలూరు పార్లమెంట్ అబ్జర్వర్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఏలూరులోని కొప్పుల వెలమ కల్యాణ మండపంలో సోమవారం ‘జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ’ సమావేశం జరి గింది. కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్న జనసైనికులను గుర్తించి సంస్థాగతంగా బాధ్యతలు అప్పగించేం దుకు ఈ సమాచార సేకరణ కార్యక్రమాన్ని చేపట్టమన్నారు. కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, నూజివీడు జనసేన ఇన్‌చార్జి బర్మా ఫణిబాబు, చింతలపూడి ఇన్‌చార్జి మేకా ఈశ్వరయ్య, దెందులూరు నాయకులు కొఠారు ఆదిశేషు, తదితరులు పాల్గొన్నారు.