పవన్‌ను విమర్శించే స్థాయి గొడ్డలి పార్టీకి లేదు
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:12 AM
జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి గొడ్డలి పార్టీ నాయకులకు లేదని భీమవరం ఎమ్మెల్యే అంజిబా బు మండిపడ్డారు.
భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు
భీమవరం టౌన్ : జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి గొడ్డలి పార్టీ నాయకులకు లేదని భీమవరం ఎమ్మెల్యే అంజిబా బు మండిపడ్డారు. భీమవరం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానికి కులం రంగు పులిమి రాజకీయ ప్రయో జనం పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. గొడ్డలి పార్టీకి కాపులపై ప్రేమ ఉంటే, వైసీపీ ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలన్నారు.
స్వార్థం కోసం కుల రాజకీయాలు సిగ్గుచేటు : చినబాబు
స్వార్థం కోసం కులాలను వాడుకోవడం సిగ్గుచేటని, వైసీపీ నాయకులు కు లం పేరుతో సమావేశాలు పెడుతూ సమాజంలో అరాచకాలు సృష్టిస్తున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) అన్నారు. కేవలం వారి రాజకీయ స్వార్థం, లబ్ధి కోసమే పేర్ని నాని, తోట త్రిమూర్తులు, బొత్స సత్యనారా యణ వంటి సీనియర్ నాయకులు ఇలా కుల రాజకీ యాలకు తెరతీయడం సిగ్గుచేటు అన్నారు. సాయికృష్ణ అనే నిందితుడిని కాపు కులా నికి ఆపాదిస్తూ వైసీపీ నేతలు మద్దతు పలకడం దారుణమన్నారు.. దుర్మా ర్గుడికి కొమ్ముకాయడం కాపు కులానికే అవమానమన్నారు.
కులమతాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ కుట్ర
నరసాపురం, జూన్ 23(ఆంధ్రజ్యోతి):డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కాపులకు అన్యాయం చేశాడని వైసీపీ కాపు నేతలు మాట్లాడటం సిగ్గుచేటని విప్ నాయ కర్ మండిపడ్డారు. మంగళవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేక ర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని కులాలను, మతాలను గౌరవించి పాలన సాగిస్తోందన్నారు. అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జగన్ కాపుల్ని అడ్డుపెట్టుకుని కులమతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తు న్నారన్నారని, ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పవన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తే తమకు ఇమేజ్ వస్తుందని వైసీపీ నేతలు భావిం చడం దారుణమన్నారు. కాపులపై సవతిప్రేమ మానుకోవాలని హితవు పలికారు.
కాపుల్ని దూరం చేసే యత్నం : చాగంటి చిన్న
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నుంచి కాపుల్ని దూరం చేసేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతోందని డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి చిన్న అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ కాపులు పోరాడి సాధించుకున్న ఐదుశాతం రిజర్వేషన్‌ను రద్దు చేసినప్పుడు వైసీపీ కాపు నేతలు ఏమయ్యారంటూ ప్రశ్నించారు.
వైసీపీవి స్వార్థ రాజకీయాలు : పత్సమట్ల భీమరాజు
గణపవరం: వైసీపీకి స్వార్ధ రాజకీయాలు చేయడం తప్ప ఓ సిద్ధాంతం అంటూ లేదని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు సోదరుడు పత్సమట్ల భీమరాజు ఆరోపించారు. మంగళవారం గణపవరంలో ఆయన విలేకరులతో మాట్లా డుతూ విజయవాడలో జరిగిన రౌడీషీటర్ కేసులో వైసీపీ నేతలు చేస్తున్న రాద్దాంతం కేవలం కులాల మఽధ్య చిచ్చుపెట్టేందుకేనని ఆరోపించారు. రాష్ట్రంలో ఏం జరిగిన దానికి కులం రంగు పులిమి స్వార్థరాజకీయాలకు వైసీపీ పాల్పడుతుందని విమర్శించారు.