దశాబ్దాల కల సాకారం
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:22 AM
దశాబ్దాల కాలంగా ఎదురు చూ స్తున్న కాళీపట్నం భూ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు చేప్టటడం తో కాళీపట్నం రెవెన్యూ గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు.
జమిందారీ భూముల సర్వేకు 15 టీమ్‌లు
కాళీపట్నం రెవెన్యూ రైతుల హర్షం
సీఎం, డిప్యూటీసీఎంకు రైతుల కృతజ్ఞతలు
మొగల్తూరు/నరసాపురం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాల కాలంగా ఎదురు చూ స్తున్న కాళీపట్నం భూ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు చేప్టటడం తో కాళీపట్నం రెవెన్యూ గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు. కాళీపట్నం పడమర గ్రామ పం చాయతీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వా నికి కృతజ్ఞత తెలుపుతూ రైతులు ఆదివారం సమావేశం నిర్వహించారు. తరతరాలుగా కాళీ పట్నం రెవెన్యూ పరిధిలో 5,500 మంది రైతు లు, 7 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఆ భూములకు రిజిస్ట్రేషన్ లేక ఆర్థిక పరపతి లభించక ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ప్రభు త్వ సలహాదారు ఎంఏ షరీఫ్, టీడీపీ నియోజ కవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు సారధ్యంలో సమస్యను మొగల్తూరు పర్యటన కు వచ్చిన సీఎం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ నెల 2న క్యాబినెట్ మీటింగ్‌లో సీఎం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను 2 నెలల్లో కాళీపట్నం భూ సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించడంపై రైతులు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం నుంచి భూములపై సాగు చేసుకునే వివరాల సేకరణకు మంత్రి 15 టీమ్‌లు ఏర్పాటు చేయడంతో సమస్య త్వరితగ తిన పరిష్కారమవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. కాళీపట్నం భూములపై సాగు చేసుకునే ప్రతీ రైతుకు అధికారికంగా పట్టాలు మంజూరు చేసి రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించేందుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబా బు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
కాళీపట్నం జమిందారీ భూ సమస్య పరిష్కా రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్వర చర్యలు చేపట్టడంపై టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు హర్షం తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో 5500 కుటుం బాలకు లబ్ధి కలుగుతుందన్నారు. సమావేశాల్లో ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, మాజీ సర్పంచ్ జోగి పండు, కొప్పాడి ఉమా మహేశ్వ రరావు, మోటుపల్లి రామ భాస్కరరావు, పులపర్తి ఏసులు, నడింపల్లి రామకృష్ణంరాజు, సరిపల్లి సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.