జలధార
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:16 AM
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర దుర్భిక్షం రైతులను కంటిమీద కునుకు లేకుండా చేసింది. సాగుకు ప్రాణాధారమైన బోర్లలో సైతం నీరందక మెట్ట ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆదుకున్న వర్షాలు
ఉబికిన భూగర్భ జలాలు
ఎండుతున్న కూరగాయల పంటలకు ప్రాణం
రబీ సాగుపై రైతుల్లో చిగురించిన ఆశలు..
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర దుర్భిక్షం రైతులను కంటిమీద కునుకు లేకుండా చేసింది. సాగుకు ప్రాణాధారమైన బోర్లలో సైతం నీరందక మెట్ట ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ, వరుణుడి కరుణతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలు అడుగంటిన భూగర్భ జలాలను పైకి తెచ్చాయి. తాడేపల్లిగూడెం మండలం లాంటి మెట్ట ప్రాంతాల్లో రైతులు బోర్లను మరింత లోతుకు దించుకునే దుస్థితి నుంచి.. ప్రస్తుతం పంటలకు సమృద్ధిగా నీరందే స్థాయికి పరిస్థితి మెరుగుపడింది.
తాడేపల్లిగూడెం రూరల్, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి):ఖరీఫ్‌లో సా ధారణ విస్తీర్ణంలో సాగు జరుగుతున్నా, సకా లంలో నీరందక రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు రైతుల ను ఆందోళనకు గురిచేశాయి. తాడేపల్లి గూడెం మండలం లింగారాయుడుగూడెం, వెంకట్రామ న్నగూడెం, బంగారుగూడెం తదితర గ్రామాల్లో కూరగాయల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 వేల ఎకరాల్లో బోర్ల కింద సాగు జరుగుతుండటంతో ఆ పంటల భవితవ్యం ప్రమాదంలో పడినట్లు కనిపించింది. సరిగ్గా ఈ తరుణంలో కురిసిన వర్షాలు అన్నదాతలను ఆదుకున్నాయి. తీవ్ర వర్షా భావ పరిస్థితుల నేపథ్యం లో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటాయి. గతేడాదితో పోలి స్తే ఈ ఏడాది నీటిమట్టాలు ఏకంగా ఇరవై అడుగుల కిందకు వెళ్లిపోవడంతో చాలామంది రైతులు తమ బోర్ల పైపులను కిం దకు దింపుకోవాల్సి వచ్చింది. వర్షాలు ముఖం చాటేస్తుండటంతో పరిస్థితి ఇంకెంత దారుణం గా మారుతుందోనని వారు భయపడ్డారు.
ఉబికిన భూగర్భ జలాలు..
గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు దాదాపు అర మీటరు మేర పైకి ఉబికి వచ్చాయి. గతేడాది ఇదే సమయంలో వర్షాలకు నీటిమట్టం కేవలం పావు మీటరుకు కాస్త అటూ ఇటుగా మాత్రమే పెరిగింది. ఈ ఏడాది ఏకంగా అర మీటరు మేర నీటిమట్టం పెరగడంతో రైతుల్లో రబీ సాగుపై ఆశలు చిగురించాయి.
నీటి పొదుపు మంత్రం తప్పనిసరి..
ఎల్‌నినో ప్రభావం ఇంకా పొంచి ఉన్నందు న, పంటలకు సాగు నీరు అందాలంటే భూ గర్భ జలాలను పొదుపుగా వాడుకోవాలని మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్ర వేత్తలు, ఉద్యానవన అధికారులు రైతులకు సూచిస్తు న్నారు. అవసరమైన మేరకే పంటలకు తడి పెట్టుకో వాలని, ఉద్యాన పంటలకు డ్రిప్ విధానం ద్వారా సాగు చేయాలని సలహా ఇస్తున్నారు.
పెరిగిన భూగర్భ జలాల నీటిమట్టం మీటర్లలో..
మండలాలు ఆగస్టు సెప్టెంబరు తేడా
ఆచంట 1.42 1.04 0.31
పెనుగొండ 9.64 9.33 0.31
పెనుమంట్ర 1.72 1.59 0.13
అత్తిలి 2.03 1.26 0.77
ఇరగవరం 4.00 3.93 0.07
తాడేపల్లిగూడెం 28.1 26.3 1.08
తణుకు 4.29 3.78 0.51
ఆకివీడు 0.67 0.52 0.15
గణపవరం 8.37 8.1 0.36
కాళ్ల 1.89 1.72 0.17
పాలకోడేరు 3.42 3.21 0.21
ఉండి 1.28 0.61 0.67
నరసాపురం 6.48 6.31 0.17
పాలకొల్లు 16.86 14.13 2.73
పోడూరు 18.77 18.35 0.42
యలమంచిలి 2.14 1.34 0.8
పెంటపాడు 4.65 4.74 0.9
తగ్గిన మండలాలు
భీమవరం 9.28 9.5 0.22
మొగల్తూరు 4.03 4.67 0.64
వీరవాసరం 4.34 4.47 0.13