Share News

జయహో అమరావతి

ABN , Publish Date - Apr 03 , 2026 | 01:14 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆమోదం పొందడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైం ది. జిల్లావ్యాప్తంగా గురువారం ర్యాలీలు, కేక్‌ కటింగ్‌లు, బాణ సంచా కాల్పులు, కొవ్వొత్తుల ప్రదర్శనలతో కూటమి శ్రేణులు, ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.

జయహో అమరావతి
ఏలూరులో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి

రాజధానికి చట్టబద్ధతపై సర్వత్రా హర్షం

జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు

ఎమ్మెల్యేలు, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ర్యాలీలు, కేక్‌ కటింగ్‌లు.. పలుచోట్ల బాణసంచాలతో జోష్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆమోదం పొందడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైం ది. జిల్లావ్యాప్తంగా గురువారం ర్యాలీలు, కేక్‌ కటింగ్‌లు, బాణ సంచా కాల్పులు, కొవ్వొత్తుల ప్రదర్శనలతో కూటమి శ్రేణులు, ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. రాజధాని రైతులు చేసిన త్యాగం, పట్టుదల, మరువలేమంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ శాఖల్లోనూ జోష్‌ నెలకొంది. జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో జేడీ హబీబ్‌ బాషా ఆధ్వర్యంలో, జలవనరుల శాఖలో ఎస్‌ఈ సీహెచ్‌ దేవప్రకాశ్‌ , ఏలూరు ఆర్టీసీ డీపీటీవో షేక్‌ షబ్నం, బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో వెల్ఫేర్‌ అధికారిణి నాగరాణి ఆధ్వర్యంలో, డీపీఆర్వో కార్యాలయం, ఎస్సీ కార్పొరేషన్‌, ఏలూరు హార్టికల్చర్‌ డీడీ కార్యాలయం వద్ద అధికారులు ఉద్యోగులు, సంబరాలు చేసుకున్నారు.

– ఏలూరు (ఆంధ్రజ్యోతి)

అమరావతి చారిత్రాత్మక ఘట్టం : బడేటి

ఏలూరు టూటౌన్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి):రాజధానిగా అమరావతి పార్లమెంట్‌లో ఆమోదం పొంది చట్టంగా మారడం చారిత్రాత్మక ఘట్టమని ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి అన్నారు. ఏలూరు నగరంలో టీడీపీ శ్రేణులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని పాతబస్టాండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పూమాలలు వేసి నివాళులర్పించారు.అక్క నుంచి ఫైర్‌స్టేషన్‌ వరకు ర్యాలీ సాగుతుండగా మధ్యలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళలర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజన్నారు. ర్యాలీలో మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, ఈడా చైర్మన్‌ శివప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ పార్థసారఽథి, పూజారి నిరంజన్‌, దాసరి ఆంజనేయులు, ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

ఆంధ్రుల శాశ్వత రాజధాని అమరావతే : ఎమ్మెల్యే పత్సమట్ల

నిడమర్రు : ఆంధ్రప్రదేశ్‌ వ్రజాభీష్టం ప్రకారం నిర్మించబడుతున్న అమ రావతికి పార్లమెంట్‌ చట్టసభల్లో ఆమోదం తెలపడం పట్ల ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు హర్షం వ్యక్తం చేశారు. ఉంగుటూరులోని క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలోని లోక్‌సభ, రాజ్యసభలలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం గొప్పవిషయమంటూ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఎంతో కృషిచేసి అమరావతిని నిర్మిస్తున్నారన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం జగన్‌ మానుకోవా లన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులు, కార్య కర్తలతో కలసి బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. కూటమి నాయ కులు తదితరులు పాల్గొన్నారు.

చింతలపూడిలో భారీ ర్యాలీ

చింతలపూడి : చింతలపూడిలో కూటమి నాయకు లు కార్లు, మోటార్‌ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చా రు. ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌ మాట్లాడుతూ ఇన్నేళ్లకు ఆంధ్రప్రజల కల నెరవేరిందన్నారు. పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కామినేని సత్యనారాయణస్వామి వ్రతం

ముదినేపల్లి : ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అమరావతిని ఆమోదిస్తూ పార్లమెంటు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించి నందుకు, అమరావతికి చట్ట బద్ధత కల్పించిన శుభసందర్భంగా కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, తన సతీమణి మనోరమతో కలసి హైదరాబాద్‌లోని తమ నివాసంలో గురువారం వీర వెంకట సత్యనారా యణస్వామి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఒక వీడియో విడుదల చేస్తూ రాష్ట్ర ప్రజల రాజధాని కల నేటికీ ఎటు వంటి అనుమానాలకు, అపోహలకు తావు లేకుండ నెరవేరిందన్నారు.

అమరావతికి చట్టబద్ధత చారిత్రాత్మకం : ఎమ్మెల్యే ప్రభాకర్‌

పెదవేగి : ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ చట్టబద్ద తీర్మానం చేయడం చారిత్రాత్మకమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. రామశింగవరంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, జాతీయ జెండా పట్టుకుని గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. ప్రభాకర్‌ మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కోసం చంద్రబాబు నాయడు అహర్నిశలు చేసిన కృషి ఫలితమే చట్టబద్ధ ఆమోదమన్నారు. సర్పంచ్‌ అడపా శ్రీను, ఎంపీటీసీ గుర్రం మాధవ, పెదవేగి సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

జడ్పీలో పండుగ వాతావరణం

ఏలూరుసిటీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతి బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించడంతో జిల్లా పరిషత్‌ కార్యాలయంలో గురువారం రాత్రి జడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీప్రసాద్‌, జడ్పీ సీఈవో జగదాంబల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణం లో మహిళా ఉద్యోగులు రంగవల్లులను అందంగా తీర్చిదిద్దగా, వారిని అభి నందిస్తూ చైర్‌పర్సన్‌ చీరలను రాజధాని కానుకగా అందించారు. అధికారు లు, సిబ్బంది కలిసి దీపాలు వెలిగించి మిఠాయిలు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడం రాష్ట్ర చరిత్రలో ఒక మహత్తర మైలురాయి అని పేర్కొన్నారు.

అమరావతి కలకు చట్టబద్ధమైన బలం : ఎమ్మెల్యే మద్దిపాటి

ద్వారకాతిరుమల : అమరావతి కలకు రాజ్యాంగబద్ధమైన బలం లభిం చింది.. ఇది చారిత్రాత్మక విజయం.. ఏపీకి అండగా నిలిచిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఎంతగానో రుణపడి ఉంటారని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. ఆయన ‘ఆంధ్రజ్యోతితో ఫోన్‌లో మాట్లాడారు. ఏళ్ల తరబడి జరిగిన పోరాటానికి విజయం లభించిందని అమరావతి రైతులకు తగిన న్యాయం, గౌరవం లభించిందన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 01:14 AM