సెప్టెంబరు 5 డెడ్‌లైన్
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:10 AM
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైం దని, దీనికి సెప్టెంబరు 5వ తేదీ డెడ్‌లైన్ అని ఏపీ జేఏసీ అల్టిమేటం జారీ చేసింది.
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి.. ఏపీ జేఏసీ ఆల్టిమేటం
ఏలూరు రూరల్, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైం దని, దీనికి సెప్టెంబరు 5వ తేదీ డెడ్‌లైన్ అని ఏపీ జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, డీఏల బకాయిలు, సరెండర్ లీవుల చెల్లింపు తదితర సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 5న రాష్ట్రకార్యవర్గ సమావేశం విజయవాడలో నిర్వహిస్తున్నట్టు ఏపీ ఐకాస, ఏలూరు జిల్లా ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్య క్షుడు చోడగిరి శ్రీనివాస్ ప్రకటించారు. గురు వారం స్థానికంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరి ష్కారానికి తాము ఎప్పుడూ చర్చలు సంప్ర దింపులకే తొలి ప్రాధాన్యం ఇస్తామని, చర్చలు విఫలమైతేనే ఉద్యమ బాట పట్టడం అనివార్య మవుతుందని స్పష్టం చేశారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు తీరుస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో పేర్కొందన్నారు. కూటమి ప్రభుత్వం ఒక డీఏ ఇచ్చిందని, ఇంకా ఐదు డీఏలు బకాయిలు ఉన్నాయన్నారు. ఇతర ఆర్థిక బకాయిల చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ కార్డు ఊసే లేదదన్నారు. జేఏసీ కన్వీనర్ తాళ్లూరి రామారావు, రాష్ట్ర ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్‌ఎస్ హరనాథ్, ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ సెక్రటరీ నెరుసు రామా రావు తదితరులు పాల్గొన్నారు.