Share News

22ఏ భూములకు మోక్షం కలిగేనా?

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:43 AM

జిల్లాలో 22ఏ నిషేధిత జాబితాల్లో చేరిన రెవె న్యూ, దేవదాయశాఖ, ఇతర భూములకు వేగంగా మోక్షం లభించే దిశగా కిందస్థాయిలో పర్యవేక్షణ లేక జరగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నా యి.

 22ఏ భూములకు మోక్షం కలిగేనా?

నేడు డీఆర్‌సీలో మంత్రి నాదెండ్ల సమీక్ష ..

ఆర్డీవోల పరిధిలో 178 కేసులు పెండింగ్‌

(ఏలూరు–ఆంధ్ర జ్యోతి)

జిల్లాలో 22ఏ నిషేధిత జాబితాల్లో చేరిన రెవె న్యూ, దేవదాయశాఖ, ఇతర భూములకు వేగంగా మోక్షం లభించే దిశగా కిందస్థాయిలో పర్యవేక్షణ లేక జరగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నా యి. జిల్లాలో గతేడాది డిసెంబరులో మెగా 22ఏ పరిష్కారమేళాను విజయవంతంగా నిర్వహించినా రెండోసారి జరిగిన మేళాలో సమస్యలు పెద్దగా పరిష్కారం కాలేదు. ఓవరాల్‌గా 1,856 మందికి సంబంధించి 1,061 ఎకరాల భూములకు 22ఏ జాబితా నుంచి విముక్తి లభించింది. ప్రధానంగా దేవదాయశాఖకు సంబంధించిన భూములు 22ఏ నుంచి తొలగించడానికి ఎక్కువగా యంత్రాంగా నికి ప్రతిబంధకాలు ఎదురవుతున్నట్టు సమాచా రం. ఏలూరులో ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనో హర్‌ అధ్యక్షనత నేడు జరిగే డీఆర్‌సీ సమావేశం లో ఏ విధంగా అధికారులు స్పందిస్తారో అన్న ఆసక్తి నెలకొంది. మంత్రి అధ్యక్షతన కలెక్టరేట్‌లో జిల్లా సమీక్షా సమావేశం (డీఆర్‌సీ) మంగళవా రం మధ్యాహ్నం మూడు గంటలకు జరగనుంది. దేవదాయశాఖ పరిధిలో 22ఏ జాబితాలోని సమ స్యల పరిష్కారానికి ఏ విధమైన ఆదేశాలు, సూచ లను ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో దేవదాయశాఖకు సంబంధించి 47 కేసు లు 22ఏ కింద నమోదయ్యాయి. ఇప్పటి వరకు 13 కేసులు పరిష్కారమయ్యాయి.

ఏలూరులోని సమస్యకు పరిష్కారం లేదాయే?

ప్రధానంగా ఏలూరు నగరంలోని విజయ గార్డెన్స్‌లో నాలుగు ఎకరాల భూములు అనుకోని రీతిలో ఎండోమెంట్‌ స్థలాలను ఆనుకుని ఉండడం వల్ల అక్కడ సర్వే నెంబర్‌లోకి చేరిపోయాయి. వీటిని జాబితా నుంచి తొలగిస్తే మా స్థలాలను అమ్ముకుని పిల్లలకు పెళ్లిళ్లు, ఇతర వసతుల కల్ప నకు వెళదామంటే కష్టంగా ఉందని, ఇక్కడ రిటైర్డు ఉద్యోగులు గతేడాది మెగా మేళాలోనే స్వయంగా మంత్రి నాదెండ్ల వినతి ఇచ్చారు. పది రోజుల్లో పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించాలని ఆదేశం ఇచ్చినా ఇప్పటి మోక్షం కలగలేదని వారు వాపోతున్నారు. కార్పొరేషన్‌కు వేలల్లో పన్నులు చెల్లిస్తున్నా... మా గతేమిటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1953 నుంచి రిజిస్ర్టేషన్‌ అయిన స్థలాలను అనుభవిస్తున్నామని చెబుతున్నారు.

ఆర్డీవోల వద్ద 178 కేసులు

రెవెన్యూశాఖ పరంగా 22ఏ జాబితాలోని సమ స్యలను పరిష్కరించే అఽధికారం కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్ల పరిధిని నుంచి ఆర్డీవోల పరిధిలోకి తేవ డంతో వీటికి మోక్షం కలుగుతాయని ఆశించినా పెద్దగా జరగలేదన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో ఏలూరు ఆర్డీవో పరిధిలో 29 కేసులు, నూజివీడు ఆర్డీవో పరిధిలో 108, జంగారెడ్డిగూడెం ఆర్డీవో పరిధిలో 41 కేసులున్నాయి. కాగా జిల్లాలో ఎల్‌నినో పరిస్థితులు, వరదల పరిస్థితిపైన మంత్రి సమీక్షించి దిశా నిర్దేశం చేయనున్నారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లిం చడం, రాబోయే వరదల నివారణకు తీసుకోవా ల్సిన ముందస్తు చర్యలపైన ఆయన అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు.

Updated Date - Aug 04 , 2026 | 12:43 AM