Share News

జిల్లాలో జనాభా తగ్గిందా ?

ABN , Publish Date - May 31 , 2026 | 01:24 AM

జిల్లాలో జనాభా పెరుగు తుందని అంతా భావించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహిస్తున్న లెక్కల్లో పదిశాతమైనా జిల్లా నుంచి పెరుగుదల సాధ్యమవు తుందని ఆశించారు.కానీ అధికారులు లెక్కలు తల్లకిందుల య్యాయి.

 జిల్లాలో జనాభా తగ్గిందా ?

ప్రతి ఇంటిలో జనాభాను నమోదు చేసుకున్న ఎన్యూమరేటర్లు

దాదాపు 51 వేల మంది తగ్గినట్టు అంచనా

ఖంగుతున్న అధికారులు

ఎందుకిలా జరిగిందనేదానిపై సమీక్ష

మరోసారి సర్వే చేసేందుకు నిర్ణయం

జిల్లాలో జనాభా పెరుగు తుందని అంతా భావించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహిస్తున్న లెక్కల్లో పదిశాతమైనా జిల్లా నుంచి పెరుగుదల సాధ్యమవు తుందని ఆశించారు.కానీ అధికారులు లెక్కలు తల్లకిందుల య్యాయి. జనాభా పెరుగుదల మాటలా ఉంచితే తగ్గినట్టు తేలడంతో అంతా ఉలిక్కిపడ్డారు. కారణాలేమిటనేది తెలియ రావడం లేదు. క్షేత్రస్థాయిలో మళ్లీ సర్వే నిర్వహించి లెక్కలు తేల్చేందుకు సిద్ధమవుతున్నారు.

భీమవరం టౌన్‌, మే 30 (ఆంఽధ్రజ్యోతి) : గతంలో ఏటా జనాభా పెరుగుదల నమోదయ్యేది.. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనగణన ఆధారంగా ఈ విషయం తెలిసేది. 2011 తర్వాత ఇటీవల చేపట్టిన గృహ గణన సర్వే వివరాలు విస్మయం కలిగిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 20 మండలాలు, 6 మునిసిపాల్టీల్లో సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో హెచ్‌ఎల్‌బీఎస్‌లు 3,486 ఉన్నాయి. ప్రతీ ఎన్యూమరేటర్‌కు 300 ఇళ్లు సర్వే చేపట్టేలా నిర్ణయించారు. గృహ గణనతో పాటు, జనాభా సంఖ్య తేల్చేందుకు జిల్లాలో పక్కా ప్రణాళికతో వెళ్లారు. జనాభా తగ్గుదల నమోదు కావడంతో మరోసారి పునఃపరిశీలిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుదల లేనట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. నిజానికి ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లాలో గృహగణన ప్రారంభించారు. ఈ నెలాఖరుతో ముగియనుంది. ఇప్పటి వరకు జరిగిన సర్వే ఆధారంగా వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ను చూసి అధికారులు కంగుతింటున్నారు. నమోదైన జనాభాలో గతంలో కంటే తగ్గుదల కనిపించింది.

51,362 మంది తగ్గారు

దేశవ్యాప్తంగా 2011లో జనాభా లెక్కలు నిర్వహించారు. జిల్లాలోని మండలాల పరిధిలో అప్పటి లెక్కల ప్రకారం 18,45,029 మంది జనాభా ఉన్నారు.. 2026 సంవత్సరంలో ఈ నెలలో నిర్వహించిన గృహ గణనలో భాగంగా ఇంట్లో ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించారు. ఆ లెక్కల ప్రకారం 17,93,667 మంది ఉన్నట్లుగా లెక్క తేలింది. దీని ప్రకారం ఈ 15 ఏళ్లలో 51,362 మంది తగ్గినట్టుగా తెలుస్తోంది.గ్రామీణ ప్రాంతాలు ఎక్కువుగా ఉన్న ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా 15 సంవత్సరాల తరువాత జనాభా పెరగాలని కానీ తగ్గటంతో అధికారులు ఆశ్చర్య పోతున్నారు. తేడా ఎందుకు వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఎన్యూమరేటర్లతో సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకుంటున్నారు.ఇప్పటికే 99.95 శాతం గృహ గణన సర్వే పూర్తి అయిపోయింది. మిగిలిన 1 శాతం వచ్చినా అనుకున్నంత జనాభా పెరగదనే అంచనాకు వచ్చేశారు. దీంతో మరోసారి సర్వే చేయించాలని భావిస్తున్నారు.

ఎందికిలా ?

గృహగణన సర్వేలో భాగంగా అద్దెకు ఉంటున్నారని వదిలి వేయడం వల్ల సంఖ్య తగ్గిందనే అభిప్రాయపడు తున్నారు. మరోవైపు ఇతర రాష్ర్టాల వారు ఇక్కడ ఉద్యోగ రీత్యా నివాసం ఉంటున్నారు. వారంతా తమ సొంత రాష్ట్రంలో జనాభా నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మరో వైపు గడిచిన 15 సంవత్స రాల కాలంలో జిల్లా నుంచి హైదరాబాద్‌, చెన్నయ్‌, విశాఖ వంటి ప్రాంతాలకు ఉద్యోగ, వ్యాపార రీత్యా తరలివెళ్లారు. వారంతా అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే జిల్లాకు ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన వారూ ఉన్నారు. వారంతా ఇప్పటికీ తమ సొంత రాష్ట్రంలోనే ఉండేలా ఎన్యూమరేటర్‌లకు వివరించారు. అదేవిధంగా డోర్‌ లాక్‌లు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో డోర్‌ లాక్‌ల సంఖ్య తగ్గింది. ఆదివారంతో సర్వే గడువు ముగియనుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అద్దెకు ఉన్నాసరే నమోదు చేయాల్సిందేని అధికారులు సూచించారు. ఆ మేరకు మరోసారి సర్వే నిర్వహిస్తే జనాభా పెరుగుతుందని ఆశిస్తున్నారు.

Updated Date - May 31 , 2026 | 01:24 AM