శాస్త్రోక్తంగా సుందరగిరిపై నరసింహ హోమం
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:39 AM
ఐ.ఎస్.జగన్నాథపురం సుందర గిరిపై స్వయంవ్యక్తునిగా కొలువుదీరిన లక్ష్మీనారసింహునికి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం ఆలయంలో అభిషేక పూజలను అర్చకులు, పండితులు జరిపారు.
ద్వారకాతిరుమల, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఐ.ఎస్.జగన్నాథపురం సుందర గిరిపై స్వయంవ్యక్తునిగా కొలువుదీరిన లక్ష్మీనారసింహునికి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం ఆలయంలో అభిషేక పూజలను అర్చకులు, పండితులు జరిపారు. ఆలయ యాగశాలలో నరసింహహోమాన్ని వేదమంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందగా ఆలయాన్ని, పరిస రాలను మామిడితోరణాలు, పుష్పమాలికలతో సుందరీకరించారు. అనంతరం గర్భాలయంలో కొలువైన లక్ష్మీనారసింహుని మూలవిరాట్‌కు అర్చకులు, పండి తులు చందనం, పసుపు, కుంకుమ ఇతర ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరించి హారతులిచ్చి నివేదనలు జరిపారు. భక్తులకు స్వామిని దర్శించుఉని తీర్థప్రసాదాలను స్వీకరించారు.