Share News

ఫిట్‌నెస్‌ ఓకేనా..!

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:40 AM

ప్రైవేటు స్కూళ్ల బస్సుల డ్రైవర్ల తప్పిదాలతో ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

ఫిట్‌నెస్‌ ఓకేనా..!
స్కూలు, కాలేజీ బస్సుల తనిఖీలు చేస్తున్న రవాణాశాఖ అధికారులు

1,002 బస్సులకు గాను 849 బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల జారీ

153 బస్సుల్లో కొన్ని లోపాలు.. నోటీసులు జారీ

ఇకపై అనుమతికి మించి విద్యార్థులను ఎక్కిస్తే కేసుల నమోదు

815 ఏళ్లు దాటిన బస్సులకు నో రెన్యువల్‌

ఏలూరు క్రైం, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు స్కూళ్ల బస్సుల డ్రైవర్ల తప్పిదాలతో ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తమ బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకుని స్కూళ్లకు పంపిస్తుంటే డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా కొంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఎంతోమంది తమ అవయవాల ను శాశ్వతంగా కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యం లోనే జిల్లాలో ఏ ఒక్క స్కూలు బస్సు చిన్న ప్రమాదానికి లోను కావడానికి వీలు లేదంటూ ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిశోర్‌, జిల్లా ఉపరవాణాశాఖ అధికారి షేక్‌ కరీమ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ చర్యలను చేపట్టారు.

జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో స్కూలు బస్సుల వల్ల ఎలాంటి ప్రమాదాలు లేకుండా చేయడం, బిడ్డలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనే ఉందంటూ అధికారులు ప్రకటించి ఆ దిశగా చర్యలను చేపట్టారు. జిల్లాలో వాహనాలు కలిగిన విద్యాసంస్థల యాజమాన్యాలతో జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఇటీవల సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ, డీటీసీ పలు అంశా లను యాజమాన్యాలకు తెలిపారు. ‘ప్రతి స్కూలు బస్సులో డాష్‌బోర్డు కెమెరాలను ఏర్పాటు చేయాలని, డ్రైవర్లకు బ్రీత్‌ ఎనలైజర్లతో తనిఖీలు నిర్వహించాలి. వాహనాలను పూర్తి కండీషన్‌లో ఉంచాలి. హెవీ లైసెన్సు, మూడేళ్ల అనుభవం కలిగిన వారే డ్రైవర్‌గా నియమించాలి. 60 ఏళ్లు దాటిన వారిని డ్రైవర్‌గా నియమించకూడ’దంటూ ఆదేశాలు జారీ చేశారు.

గతంలో ఇతర రాష్ట్రాల్లో (కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌, తమిళనాడు, కేరళ) కొండచర్యల ప్రాంతాల్లో అతి తక్కువ కాలం వినియోగిం చిన బస్సులను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ స్కూల్‌ బస్సులుగా తిప్పేవారు. ఇలాంటి బస్సులు గతంలో ప్రమాదాలకు గురయ్యేవి. ఇలాంటి బస్సులు వస్తే వాటిని తిరిగి రీ రిజిస్ట్రేషన్‌ చేయడానికి ఖచ్చితమైన నియమ నిబంధనలను పూర్తిస్థాయిలో పరిశీలన జరుపుతు న్నట్టు తెలుస్తోంది. ఇలాంటి బస్సులకు ప్రతి ఏడాది ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంది. ప్రస్తుతం నేటి నుంచి (8వ తేదీ) ఇంటర్మీడియట్‌ విద్యా సంస్థలు తెరవనుండ డం, 12వ తేదీ నుంచి ఎలిమెంటరీ, హైస్కూలు విద్యా సంస్థలు తెరుచుకోనున్న దృష్ట్యా రవాణాశాఖ అధికారులు ఈ వేసవిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ప్రాంతాల్లో ఐదు రవాణాశాఖ అధికారుల బృందా లను ఏర్పాటు చేసి స్కూలు బస్సులను తనిఖీలను చేపట్టా రు. మొత్తం 35 రకాల నియమ నిబంధనలను పరిశీలించారు. ఏ ఒక్క నిబంధన ఉల్లంఘించిన ఆ యజమానులకు నోటీసులు జారీ చేశారు.

ప్రస్తుతం పాఠశాలలు, కాలేజీలు తెరవనున్న దృష్ట్యా రవాణాశాఖ అధికారులు మరో కార్యాచరణ చర్యలు చేపట్టడానికి రంగం సిద్దం చేస్తున్నారు. బస్సులో అనుమతికి మించి విద్యార్ధులను ఎక్కిస్తే ఖచ్చితంగా వారిపైన కేసులు నమోదు చేయడా నికి ఈ తనిఖీలను స్కూళ్లు తెరచిన రోజు నుంచే కొనసాగించనున్నట్టు సమాచారం. కొంత మంది ఆటో డ్రైవర్లు ఆటో కిక్కిరిసేలా 15 మంది వరకూ విద్యార్థులను ఎక్కిస్తున్నారు. ఇలాంటి వాటిపై కూడా అధికారులు దృష్టి సారించనున్నారు. కొన్ని విద్యా సంస్థల బస్సులు అనుమతికి మించి అదనంగా విద్యార్థులను ఎక్కించి నిలబడి ప్రయాణం చేసేలా చేస్తున్నారని ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు అందాయి. వీటిని ఈ ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని రవాణాశాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

నిబంధనలు పాటించాల్సిందే

జిల్లాలో ఉన్న విద్యా సం స్థల బస్సులు ఇప్పటి వరకు తమ వద్ద నమోదు చేయిం చుకున్న 1002 బస్సులకు గాను 849 బస్సులను పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకా రం తనిఖీలు నిర్వహించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను జారీ చేశాం. ఇంకా 153 బస్సుల లో కొన్ని లోపాలు ఉండడాన్ని గుర్తించి వాటిని సరిచేయాలని నోటీసులు జారీ చేశాం. 15 ఏళ్లు దాటిన బస్సులకు ఎట్టి పరిస్థితుల్లో రెన్యువల్‌ ఉండదు. బస్సు డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లో మద్యం తాగి వాహ నాలను నడపకూడదు. ప్రతి బస్సులో అటెండర్‌ ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలు ప్రయాణించే బస్సు డ్రైవర్‌ను పరిశీలించాలి. బస్సులో ప్రయాణం తమ పిల్ల లు నిలబడి వెళ్తున్నారో, కూర్చుని వెళ్తున్నారో గమ నించుకోవాలి. ఎక్కడైనా డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రమా దాలు నెలకొంటె అవసరమైతే ఆ స్కూలు గుర్తింపు రద్దుకు విద్యాశాఖ అధికార్లతో సిఫార్సు చేస్తాం.

–షేక్‌ కరీమ్‌, డీటీసీ

Updated Date - Jun 08 , 2026 | 12:40 AM