Share News

మహర్దశ పట్టేనా..?

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:31 AM

జిల్లాలో సాగునీటి చెరువుల అభివృద్ధి ప్రతి పాదనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చిన్ననీటి పారుదల, కీలక మేజర్‌, మైనర్‌ చెరువుల్లో కనీసం తట్టెడు మట్టి తీసింది లేదు. కూటమి ప్రభుత్వం హయాంలో ట్రిపుల్‌ ఆర్‌ (రిపేర్లు, రిసోస్టరేషన్‌, రీ కనస్ట్రక్షన్‌) పథకం కింద తొలి విడతగా రూ.260 కోట్ల వ్యయంతో ప్రతి పాదనలు పంపగా, ఇప్పటివరకు కేంద్రం నుంచి ఆమోద ముద్ర పడలేదు.

మహర్దశ పట్టేనా..?

తొలివిడతగా 350 సాగునీటి చెరువుల ప్రక్షాళనకు చర్యలు

రూ.260 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు

ట్రిపుల్‌ ‘ఆర్‌’ పథకం మంజూరుపై ఆశలు

రాష్ట్రం వాటాగా 40 శాతం నిధులు

కేంద్ర ఆమోద ముద్రలో జాప్యం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో సాగునీటి చెరువుల అభివృద్ధి ప్రతి పాదనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చిన్ననీటి పారుదల, కీలక మేజర్‌, మైనర్‌ చెరువుల్లో కనీసం తట్టెడు మట్టి తీసింది లేదు. కూటమి ప్రభుత్వం హయాంలో ట్రిపుల్‌ ఆర్‌ (రిపేర్లు, రిసోస్టరేషన్‌, రీ కనస్ట్రక్షన్‌) పథకం కింద తొలి విడతగా రూ.260 కోట్ల వ్యయంతో ప్రతి పాదనలు పంపగా, ఇప్పటివరకు కేంద్రం నుంచి ఆమోద ముద్ర పడలేదు.

జిల్లాలో వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు, భూగర్భ జలాల వృద్ధికి సాగునీటి చెరువుల అభివృద్ధి చాలా కీలకం. వీటిని ఒక పక్కా ప్రణాళికతో ట్రిపుల్‌ ఆర్‌ పథకం కింద మొత్తం 1,513 సాగునీటి చెరువుల ప్రక్షాళన దశల వారీగా చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించారు. దీనిపై జిల్లాల జల వనరులశాఖ అధికారులు కసరత్తులు చేశారు. తొలి విడ తగా రూ.260 కోట్లతో 350 చెరువులను అభివృద్ధి, మరమ్మ తులు, పునర్‌ నిర్మాణం కోసం ప్రతిపాదనలు గతేడాది అక్టోబరు లో యుద్ధప్రాతిపదికన పంపారు. ఇంకా ఆమోద ముద్ర పడ లేదు. దీంతో చెరువుల అభివృద్ధిపై నీలినీడలు అలముకున్నాయి.

60:40 శాతం భరింపే మెలిక

సాగునీటి చెరువుల ప్రక్షాళన సాగితే వ్యవసాయంతో పాటు స్థానికంగా అన్ని అవసరాలకు ఉపయుక్తమే. ఈ పనుల ఆమోదముద్ర విషయంలో కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరించాల్సి ఉంటుంది. ఇక్కడ కీలకమైన అంశం ముడిపడి ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే పలు కీలక పథకాలపై పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుండగా సాగునీటి చెరువులకు 40 శాతం నిధులను రాష్ట్రం సర్దుబాటు చేయడం ఆచరణలో కొంత కష్టసాధ్యమే. దీంతో ఈ ప్రతిపాదనలు ఆమోదముద్రకు చాలా సమయం పట్టే అవకాశాలు న్నాయని అధికారులు చెబుతున్నారు. నిధులు మంజూరై.. పనులు జరిగే సాగునీటి చెరువులకు మహర్దశ పట్టినట్టే. ఈ దిశగా ఎంపీ పుట్టా మహేశ్‌తో పాటు, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు ట్రిపుల్‌ ఆర్‌ను పథకం త్వరితగతిన అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jan 30 , 2026 | 12:31 AM