Share News

సాగు నీరు పుష్కలం

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:26 AM

జిల్లాలో రబీ సీజన్‌కు సాగు జలాలు సమృద్ధిగా ఉన్నాయి.

సాగు నీరు పుష్కలం
గుండుగొలను సమీపంలో గోదావరి కాల్వ

పంటలకు సమృద్ధిగా జలాలు

ఏప్రిల్‌లో కాల్వల మూసివేతతో

సాగునీటి ఎద్దడి

తెరపైకి వంతుల వారీ విధానం

ఇరిగేషన్‌ అధికారుల కసరత్తు

అడ్డుకట్టలకు రూ.1.71 కోట్లు

గోదావరి కాల్వ కింద రెండో పంటకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. నిండుగా గోదావరి నీళ్లున్నప్పటికి, సీలేరు నుంచి అదనపు జలాలతో పంటలు గట్టెక్కే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విజ్జేశ్వరం నుంచి 5,500 కూసెక్కులు, సీలేరు నుంచి 14వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్‌ మొదటి వారం కాల్వలకు నీరు నిలుపుదలతో సాగునీటి ఎద్దడి తలెత్తే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వంతుల వారీగా నీరందించడానికి జలవనరుల శాఖ డెల్టాల పరిధిలో ప్రత్యేక నిఘా పెట్టనుంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రబీ సీజన్‌కు సాగు జలాలు సమృద్ధిగా ఉన్నాయి. మార్చి నెలాఖరు వరకు సాగునీటికి ఢోకా ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్‌లో కాల్వల మూసివేత సమయంలో నీటి ఎద్దడి తలెత్తే పరిస్థితి ఉండడంతో వంతుల వారీ విధానం అమ లుపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. జిల్లాలో ఏలూరు గోదావరి కాల్వ కింద ఏలూరు, దెందు లూరు, భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు మండ లాల్లో 59,768 ఎకరాలు, వెంకయ్య వయ్యేరు కాల్వ కింద నిడమర్రులో 22,125, ఓల్డ్‌ వయ్యేరు కాల్వ కింద కైకలూరులో 358 ఎకరాలు కలిపి మొత్తం 82,251 ఎకరాల ఆయకట్టులో పంటలు సాగవుతు న్నాయి. పంటలకు అవసరమైనంత నీరందిం చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

క్రాస్‌బండ్‌లకు రూ.1.71 కోట్లు

ఏప్రిల్‌లో సాగు నీటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఎకరాకు సైతం నీరందించేందుకు జలవనరుల శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. వంతుల వారీ విధానంలో పశ్చిమ, తూర్పు, మఽధ్య డెల్టాల పరిధి లో 63 చోట్ల సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో క్రాస్‌బండ్‌లు ఏర్పాటుకు రూ.1.71 కోట్ల వెచ్చిం చాలని ప్రతిపాదించారు. ఇవన్నీ నామినేషన్‌ పద్ధతి లోనే సాగునీటి సంఘాలు పర్యవేక్షణ చేస్తాయి

కాల్వల ప్రక్షాళనతో ఇక్కట్లు తీరాయి

ఇటీవల గోదావరి కాల్వలో గుండుగొలను సెక్షన్‌ నుంచి ఏలూరు వరకు కాల్వల్లో తూడు, గుర్రపు డెక్క సాగునీటి సంఘాలు తొలగించడంతో శివారు భూములకు కూడా నీరందుతోంది. ఇటీవల గోదా వరి కాల్వ కింద ఉన్న ఏలూరు కార్పొరేషన్‌ నీటి అవసరాలకు కూడా నీటిని కొంతమేర నింపారు.

చేపల చెరువులతోనే చేటు?

జిల్లాలో గోదావరి కాల్వ కింద నిడమర్రు, భీమడోలు మండలాల్లో కొల్లేరు, ఇతర ప్రాంతాల్లో చేపల చెరువుల వలన రబీలో వరిపంటకు కొంత ఇబ్బందికరమే. వీరు ఇప్పుడు నీటిని తోడేసి చెరువుల్లో నింపి పాత నీరు వదలడం వలన రైతుల పంటలకు ఇబ్బందిగా పరిణమించింది.

ఓఅండ్‌ఎం పనులు

జిల్లాలో గోదావరి పశ్చిమ డెల్టా కింద ఓ అండ్‌ ఎంలో చింతలపూడి, దెందులూరు, ఏలూరు, పోల వరం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో కాల్వల మరమ్మతులు, నిర్వహణ పనులను చేయాలని టెండర్లు పిలిచారు. 201 పనులను రూ.9.11 కోట్లతో చేయాలని సంకల్పించారు.

Updated Date - Mar 01 , 2026 | 12:26 AM