Share News

ఆడిట్‌పై.. అలక్ష్యం!

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:49 AM

జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌, మిగిలిన మూడు పురపాలక సంఘాల్లోనూ ఆడిట్‌ అభ్యంతరాలపై నిర్లక్ష్యం తాండవిస్తోంది. మేము ఎవ్వరికి బాఽధ్యుల కామన్న రీతిలోనే కమిషనర్లు, కిందిస్థాయి అధికారులు వ్యవహ రిస్తున్నారు.

ఆడిట్‌పై.. అలక్ష్యం!

కార్పొరేషన్‌, పురపాలక సంఘాల్లో పేరుకుపోయిన అభ్యంతరాలు

కొరవడిన ఆర్జేడీ పర్యవేక్షణ

మొక్కుబడి సమీక్షలతో సరి..

కిందిస్థాయి అధికారుల్లో లెక్కలేనితనం..

జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌, మిగిలిన మూడు పురపాలక సంఘాల్లోనూ ఆడిట్‌ అభ్యంతరాలపై నిర్లక్ష్యం తాండవిస్తోంది. మేము ఎవ్వరికి బాఽధ్యుల కామన్న రీతిలోనే కమిషనర్లు, కిందిస్థాయి అధికారులు వ్యవహ రిస్తున్నారు. ఏళ్ల తరబడి అభ్యంతరాలు పేరుకుపోతున్నాయే తప్ప.. ఎక్కడ ఈ సంఖ్య తగ్గడం లేదు. పురపాలకశాఖ ఆర్జేడీ పర్యవేక్షణ లేక ప్రజాధనం దుర్వినియోగానికి లెక్క లేకుండా పోతోంది. జిల్లాలో రూ.30 కోట్ల 74 లక్షలు నిధులు, పన్నుల వసూళ్లకు అంతూపొంతూ లేకుండా ఉంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

పురాల్లో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. కోట్లాది రూపాయలు బొక్కేసినా జవాబుదారీ తనం తూచ్‌గానే ఉంది. కమిషనర్లు, ఇంజనీరింగ్‌ అధికా రులు, రెవెన్యూ అధికారులు, కిందిస్థాయి వర్క్‌ ఇన్‌ స్పెక్టర్లు సైతం ప్రజాధనం సక్రమంగా వినియోగించే విషయంలో లెక్కలేనితనంగా, వివరాలు అందించకుండా కప్పదాట్లకు పాల్పడుతున్నారు. దీంతో నిధులు పక్కదారి పట్టాయో?లేదో.. అసలు ఏంజరిగిందో అంతుబట్టని విధంగా పురాల్లో అలక్ష్యం జాడ్యం చోటుచేసుకుంది.

ఏలూరులో అత్యధికంగా..

ఏలూరు కార్పొరేషన్‌లో 1990 నుంచి ఇప్పటి వరకు ఆడిట్‌ అభ్యంతరాలు కొకొల్లలుగా నమోదయ్యాయి. దాదాపుగా ఆరేడు పాలకవర్గాలు మారాయి. అయినా ఆడిట్‌ అభ్యంతరాల పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రధానంగా ఇంజనీరింగ్‌ పనులు జరిగిన సందర్భంలో ఎంబుక్‌ల్లో వివరాలను నమోదు చేయకపోవడం.. మరో వైపు ఒకదాంట్లో రెండు మూడు పద్దులు కలిపి చూడ డం వెరిసి ఆడిట్‌ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ కార్పొరేషన్‌లో డీఅండ్‌వో ట్రేడ్స్‌ వసూళ్లలో లెక్కలు లేకపోవడం, ఆస్థి పన్నుల వసూళ్లకు సంబం ధించి వసూళ్లు గంపగుత్తగా వసూలు చేసినట్టు చూప డం.. వాటిని రిజిస్టర్‌ల్లో నమోదు చేయక పోవడం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆడిట్‌ ఎగ్జామినర్లు, ఇతర అధికారులున్నా అభ్యంతరాల సంఖ్య 2,583 చేరు కుంది. వీటి విలువ రూ.29కోట్ల60లక్షల పైబడి మొత్తాల పై ఆరోపణలున్నాయి. వీటిని సరిచేసుకుని సకాలంలో వాస్తవాలు వెల్లడించే వారు కరువయ్యారు.

చింతలపూడిలో..

నగర పంచాయతీకి అవతరించి పదేళ్ల పైబడి అవుతూ. పాలకవర్గం లేకపోయిన చింతలపూడిలోనే 105 ఆడిట్‌ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వీటి విలు 27.36 లక్షలుగా ఉంది. వీటికి జవాబుదారీతనం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. జంగారెడ్డిగూ డెంలో 713 అభ్యంతరాలు రాగా.. వీటి విలువ రూ.16.73 లక్షలు, నూజివీడులో 1,803 అభ్యంతరాలతో రూ.60.60 లక్షలకు సంబంధించి లెక్కలు తేలనిగా జిల్లా ఆడిట్‌శాఖ అధికారులు నిర్ధారించారు.

ఆడిట్‌పై సమీక్షించే వారే కరవు..

జిల్లాలో పురాల్లోని ఆడిట్‌ అభ్యంతరాలపై విధిగా పురపాలశాఖ ఆర్జేడీ (రాజమండ్రి) అధికారి వీటిపై ఎప్పటికప్పుడు కమిషనర్లకు దిశ నిర్దేశం చేయాల్సి ఉంది. ఏదో మొక్కుబడిగా జిల్లా సమీక్షలు చేపట్టడం, ఆడిట్‌ అభ్యంతరాలు వ్యక్తమైన తేదీ నుంచి రెండు నెలల్లోగా నివేదికలను, ఆయా కార్యాలయాల నుంచి బాఽధ్యుల ద్వారా సమాచారం పంపి పరిష్కరించే బాధ్యత తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. వివిధ విభాగాల్లో అఽధికారులు, ఉద్యోగులు బదిలీ అయితే అప్పట్లో జరిగిన లావాదేవీల్లో తేడాల పైన, అక్రమాలకు తదుపరి ఉద్యోగికి సమాచారం చెప్పకుం డా వారు విధుల నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. ఒక ఉద్యోగి పదోన్నతి లేదా బదిలీపై వెళ్లేటప్పుడు లావాదేవీలకు సంబంధించి కార్యాలయం నుంచి ఎన్‌వోసీ సర్టిఫికెట్‌ ఇస్తేగానే వెళ్లరాదు. ఈ నియమ నిబంధనలను పురపాలక సంఘ కార్యాలయాల్లో అమ లు చేసేవారే కరవయ్యారు. దీంతో ప్రజాధనంపై లెక్క లేనితనంతో అవి దుర్వినియోగం అయ్యాయా? వాటిని దిగమింగారో తేలే పరిస్థితి ఎక్కడ కానరావడం లేదు.

Updated Date - Mar 31 , 2026 | 12:49 AM