Share News

మహిళలతోనే అభివృద్ధి

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:51 AM

మహిళలతోనే అభివృద్ధి సాధ్యమని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భావం వెనుక శ్రామిక మహిళలు, సోషలిస్టు మహిళల పోరాటం వెలకట్టలేనిదని సామాజిక ఉద్యమ నేత సంకు మనోరమ అన్నారు.

మహిళలతోనే అభివృద్ధి
పాలకొల్లులో మహిళా దినోత్సవం సందర్భంగా చాంబర్స్‌ కళాశాలలో మహిళలకు సత్కారం

సామాజిక ఉద్యమ నేత సంకు మనోరమ

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

తణుకు, మార్చి7(ఆంధ్రజ్యోతి) : మహిళలతోనే అభివృద్ధి సాధ్యమని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భావం వెనుక శ్రామిక మహిళలు, సోషలిస్టు మహిళల పోరాటం వెలకట్టలేనిదని సామాజిక ఉద్యమ నేత సంకు మనోరమ అన్నారు. సీపీఐ కార్యాలయంలో ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శనివారం ఘనంగా నిర్వహించారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి వైద్యురాలు వంక వసుంధర, చేనేత కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వావిలా సరళాదేవి, కోనాల భీమారావు మాట్లాడారు. ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్‌ యు. లక్ష్మీసుందరీబాయ్‌, ఆదరణ ఫౌండేషన్‌ చైర్మన్‌ వి.ఆశాజ్యోతి, ముళ్ళఫూడి రేణుక, అధికారులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం రూరల్‌ : మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తూ ముందుకు వెళ్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఆదిత్య డిగ్రీ కళాశాలలో శనివారం వింగ్స్‌ ఆఫ్‌ ఓల్డ్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. వైద్యురాలు డాక్టర్‌ శోభారాణి, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడికొండల సింధూ, లోటస్‌ ప్రిన్సిపాల్‌ బొలిశెట్టి దేవి కళాశాల ప్రిన్సిపాల్‌ సరోజ మాట్లాడారు. తాడేపల్లిగూడెం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సీనియర్‌ సివిల్‌ జడ్జికె. మాధవి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.సూ ర్యకిరణ్‌, ఎంపీ డీవో వి.చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ రాజరాజేశ్వరి, అంగన్‌వాడి సిబ్బంది, పాల్గొన్నారు.

నరసాపురం రూరల్‌:నరసాపురం మండ లంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్‌ కాలేజీలో సీఎస్‌ బీఐఏ ఎస్‌.ఆకాడమీ ఐఏఎస్‌ డైరెక్టర్‌ మల్లవరపు బాలలత ఆధ్వర్యంలో నిర్వహించారు. చైర్మన్‌ కేఎస్‌ సత్యనారాయణ, బ్యాంకు మేనేజర్‌ కుమారి తదితరులు పాల్గొన్నారు. కొప్పర్రు ఎంపీపీ స్కూల్‌లో హెచ్‌ఎం రాజశ్రీ, సర్పంచ్‌ నల్లి వరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.

పాలకొల్లు అర్బన్‌: మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, వారిని మరింత ప్రోత్సహించాలని చాంబర్‌ అధ్యక్షుడు కేవీఆర్‌ నరసింహారావు అన్నారు. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో చాంబర్స్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు గుడాల హరిబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో నిష్ణాతులైన మహిళలను ఘనంగా సత్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, పాలక వర్గ సభ్యులు, పాల్గొన్నారు డీఎన్‌ఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.శోభారాణి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా డాక్టర్‌ సుజయశ్రీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. సీపీడీసీ సభ్యులు శ్రిఖాకొల్లు మైథిలి, పూర్వ విద్యార్థి సంఘం నాయకులు నాగమణి పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 12:51 AM