నేటితో ముగుస్తున్న ఇంటర్ మూల్యాంకనం
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:18 AM
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఈనెల 17వ తేదీలోగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఇంట ర్ జవాబుపత్రాల మూల్యాంకనం, మార్కుల నమోదుకు స్కానింగ్ ప్రక్రియలు ఏకకాలంలో జరుగుతుండగా బుధవారంతో ఈ రెండూ ముగియనున్నాయి.
17 లోగా ఫలితాలు ?
ఏలూరు అర్బన్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఈనెల 17వ తేదీలోగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఇంట ర్ జవాబుపత్రాల మూల్యాంకనం, మార్కుల నమోదుకు స్కానింగ్ ప్రక్రియలు ఏకకాలంలో జరుగుతుండగా బుధవారంతో ఈ రెండూ ముగియనున్నాయి. ఆ వెంటనే వారంరోజుల గడువులో ఫలితాలు ప్రకటించనున్నట్టు సంకే తాలు వస్తున్నాయి. మంగళవారం ఇంటర్మీడి యట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఏలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గతనెల 22 నుంచి జరుగుతున్న మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించారు. వివిధ జిల్లాల నుంచి మూల్యాంకనం నిమిత్తం 1,73,147 జవాబు పత్రాలు జిల్లాకు వచ్చినట్టు ఆర్‌ఐవో కె.యోహా న్ ఆయనకు వివరించారు. ఇంగ్లీషు సబ్జెక్టు ఆన్సర్ స్ర్కిప్టుల వాల్యూయేషన్‌తో మొత్తం మూల్యాంకన ప్రక్రియ బుధవారం ముగుస్తుం దని తెలిపారు. వాల్యూయేషన్ అనంతరం జవాబు పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌ను కార్యదర్శి పరిశీలించారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహిస్తున్న తరగతులపై ఆరా తీశారు. ఇదే ప్రాంగణంలో వున్న జూనియర్ కళాశాలకు వెళ్లి సెకండియర్ క్లాసులకు తక్కువమంది విద్యా ర్థులు హాజరవుతుండడంపై ఆరా తీశారు. తల్లి దండ్రులకు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని ప్రిన్సిపాల్ రాజ్‌కృష్ణను ఆదేశించారు.