ఆల్ ది బెస్ట్
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:52 PM
మెడిసిన్, ఇంజనీరింగ్, డిగ్రీ, తదితర ఉన్నత విద్యాకోర్సుల్లోకి గేట్‌వేగా భావిం చే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి నిర్వహించేందుకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాధారణంగా 15 నుంచి 18 రోజుల్లోగా పూర్తయ్యే ఇంటర్ పరీక్ష లు ఈ దఫా నెలరోజుల పాటు అంటే మార్చి 24 వరకు సుదీర్ఘంగా కొనసాగనున్నాయి.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
నెలరోజుల పాటు నిర్వహణ
ఈసారి మారిన పరీక్షల రూపురేఖలు
మొత్తం 34,615 మంది దరఖాస్తు
పరీక్షల నిర్వహణకు 56 కళాశాలల ఎంపిక
సీసీ కెమెరాల నిఘా నీడలో పరీక్షలు
ఆర్‌ఐవో కార్యాలయానికి అనుసంధానం
ఏలూరు అర్బన్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి):
మెడిసిన్, ఇంజనీరింగ్, డిగ్రీ, తదితర ఉన్నత విద్యాకోర్సుల్లోకి గేట్‌వేగా భావిం చే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి నిర్వహించేందుకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాధారణంగా 15 నుంచి 18 రోజుల్లోగా పూర్తయ్యే ఇంటర్ పరీక్ష లు ఈ దఫా నెలరోజుల పాటు అంటే మార్చి 24 వరకు సుదీర్ఘంగా కొనసాగనున్నాయి.
ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ ఏడాది నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త సిలబస్‌కు అనుగుణంగా మొత్తం పరీక్షల రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యంగా సైన్స్, ఆర్ట్స్ గ్రూపుల ప్రశ్నపత్రాలను ఈ ఏడాది నుంచి సమూ లంగా మార్చేసి వంద మార్కులకు (ప్రాక్టికల్స్ కలిపి) ఆయా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇవే సబ్జెక్టులకు 32 పేజీల ఆన్సర్ బుక్‌లెట్లను అందజేస్తారు. ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టుల్లో రెండు, మూడింటికి కలిపి ఒకేరోజు పరీక్షలను గతేడాది వరకు నిర్వహించగా, ఈ ఏడాది నుంచి రోజుకో సబ్జెక్టుకే పరీక్షను పరిమితం చేయడంతో ఇంటర్ పరీక్షలు సుదీర్ఘకాలం పాటు జరుగుతాయి. లాంగ్వేజి సబ్జెక్టుల పరీక్షలకు 24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్లనే అందజేస్తారు.
వారికి...పనిచేసేచోటే ఇన్విజిలేషన్ విధులు
జిల్లాలో మొత్తం 135 ఇంటర్మీడియట్ కళాశాలలుండగా, వీటి నుంచి ప్రథమ సంవత్సరం పరీక్షలకు 17,556 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,059 మంది విద్యార్థులు కలిపి మొత్తం 34,615 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ నిమిత్తం మొత్తం 56 కళాశాలలను ఎంపిక చేయగా, వీటిలో 34 ప్రైవేటు జూనియర్ కళాశాలలు, 17 ప్రభుత్వ కళాశాలలున్నాయి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకాలకు పాఠశాల విద్యాశాఖ నుంచి కేవలం వ్యాయామోపాధ్యా యులు, డ్రాయింగ్, క్రాఫ్ట్ టీచర్లను మాత్రమే ఇవ్వడానికి అంగీకారం తెలపడంతో, ఇన్విజిలేషన్ సిబ్బంది కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు ఎంచుకున్నారు. ఆ ప్రకారం ఇంటర్ పరీక్షలు జరిగే ప్రైవేటు కళాశాలల్లో పని ేస్తున్న జూనియర్ లెక్చరర్లకే అక్కడ పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేషన్ విధులను అప్పగించారు. ఇటువంటి కళాశా లల్లో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రభు త్వ కళాశాలలకు చెందిన సీనియర్ అధ్యాపకులను చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లుగా నియ మించారు. వ్యాయామోపాధ్యాయులు, డ్రాయింగ్, క్రాఫ్టు టీచర్లను ప్రభుత్వ కళాశాలల్లో విధులు నిర్వహించడానికి నియమించా లని నిర్ణయం తీసుకున్నారు.
ఆర్‌ఐవో కార్యాలయానికి సీసీ కెమెరాలు అనుసంధానం
ఇంటర్ పరీక్షలు జరిగే అన్ని గదుల్లో సీసీ కెమెరాలను అమర్చడంతో పాటు, అక్కడ పరీక్షల తీరును నిశితంగా తనిఖీ చేసేందుకు వాటిని ఏలూరులోని ఇంటర్‌బోర్డు ఆర్‌ఐవో కార్యాలయానికి అనుసంధానం చేశారు. సీసీ కెమె రాలతో నిఘాను ఆర్‌ఐవో కార్యాలయం నుంచి పరిశీలించడానికి వీలుగా వాటి డైరెక్షన్‌ను ఆర్‌ఐవో కార్యాలయం నుంచే మార్చుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రహరీ లేని ఆరు పరీక్ష కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. మాల్‌ప్రాక్టీస్, చూచిరాతలకు ఆస్కారం లేకుండా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు మూడు చొప్పున ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షకేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి.
నిమిషం ఆలస్యమైనా అనుమతించరు : యోహాన్, ఆర్‌ఐవో, ఇంటర్‌బోర్డు
పరీక్ష ప్రారంభ సమయం ఉదయం 9గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అను మతించరు. ఈ నిబంధన వల్ల విద్యార్థులు అరగంట ముందుగానే వారికి కేటాయించిన పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించడం శ్రేయస్కరం. ప్రత్యేకావసరాలు గల విద్యా ర్థులు పరీక్షలు రాసేలా వారికి సహాయపడేందుకు సుమారు 20 మంది స్రైబ్‌లను నియమించాం. హాల్ టిక్కెట్లను విద్యార్థే మనమిత్ర వాట్సాప్ నంబరు లేదా ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటవుట్‌తో పరీక్షకు హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించిందున, ట్యూషన్ ఫీజులు, బకాయిలు చెల్లించలే దన్న కారణంపై విద్యార్థులకు ప్రైవేటు కళాశాలల్లో హాల్‌టిక్కెట్లను ఇచ్చేందుకు ఇబ్బందులు పెడుతున్నారనే దానిపై ఇంతవరకు ఫిర్యాదులు అందలేదు. అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు సరిపడా ఫర్నీచర్, వెలుతురు, ఫ్యాన్లు, తాగునీరు, టాయిలెట్లు వంటి సదుపాయాలను కల్పించాం. ఆర్టీసీ బస్సు వేళలను రీషెడ్యూల్ చేశాం. పరీ క్ష కేంద్రాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరీక్షలకు సంబంధించి ఇబ్బందులు లేదా ఫిర్యాదు చేయ దలిస్తే ఆర్‌ఐవో (93929 11804), పరీక్షల ప్రత్యేకాధికారి/ ఆర్జేడీ(94408 16005), జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) సభ్యులు(85007 07056, 90591 44533, 94416 87844)కు ఫోన్‌చేసి చెప్పవచ్చు.