తణుకులో అంతర్ జిల్లా రోలర్, హాకీ పోటీలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:57 PM
తణుకు మాంటిస్సోరి స్కూల్, జూనియర్ కాలేజీలో 38వ అంతర్ జిల్లా రోలర్, హాకీ చాంపియన్‌షిప్ పోటీలను స్కూల్ డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు ప్రారంభించారు.
తణుకు, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): తణుకు మాంటిస్సోరి స్కూల్, జూనియర్ కాలేజీలో 38వ అంతర్ జిల్లా రోలర్, హాకీ చాంపియన్‌షిప్ పోటీలను స్కూల్ డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు ప్రారంభించారు. మంగళవారం జరిగిన పోటీలలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖపట్టణం, నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచి 250 మందికిపైగా క్రీడాకారులు విచ్చేశారు. టైనీటాట్స్, కేడెట్, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ బాలురు, బాలికల విభాగంలో తమ క్రీడా ప్రతిభను చూపిస్తూ పోటీలలో పాల్గొన్నారు. తణకు పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.జ్ఞానమంజరి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి.నాగేంద్రఫణి సిద్దు, క్రీడాకారులు పాల్గొన్నారు.