Share News

పారిశ్రామిక పార్క్‌లు సిద్ధం

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:21 AM

జిల్లాలో సూక్ష్మ పరిశ్రమలనైనా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

పారిశ్రామిక పార్క్‌లు సిద్ధం
లిఖితపూడిలో నిర్మాణంలో ఉన్న పారిశ్రామిక పార్క్‌

జిల్లాలో విస్సాకోడేరు, లిఖితపూడిల్లో నిర్మాణం

సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం

జనవరిలో అందుబాటులోకి.. ఒక్కో పార్క్‌లో 24 షెడ్లు

(భీమవరం టౌన్‌–ఆంధ్రజ్యోతి)

పారిశ్రామిక రంగంలో జిల్లా వెనుకబడి ఉంది. ఇక్కడ భూములు అందుబాటులో లేవు. జిల్లాలో సూక్ష్మ పరిశ్రమలనైనా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నియోకవర్గానికి ఒక పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న పార్క్‌లు జనవరిలో అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో పార్క్‌లో 24 షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో షెడ్‌లో ఒక సూక్ష్మ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. నెలవారీ అద్దె చెల్లించేలా లీజుకు ఇవ్వనున్నారు. చదరపు అడుగు రూ. 29 ఉంటుందని అంచనా. విస్సాకోడేరులో పారిశ్రామిక పార్క్‌ ఏర్పా టుకు 9.78 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం 2.16 ఎకరాల్లో షెడ్లతో పాటు, రహదారులు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నారు. నరసా పురం మండలం లిఖితపూడిలో పారిశ్రామిక పార్క్‌కు 11.54 ఎకరాల్లో రూ.4.35 కోట్లతో 24 షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. జనవరిలో అందు బాటులోకి వచ్చేలా జిల్లా పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తోంది.

ఐదు నియోజకవర్గాల్లో కసరత్తు

జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటు ప్రతిపాదన ఉంది. భూమి అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు పార్క్‌లు ఏర్పాటుచేసి లీజుకు లేదా అమ్మకానికి పెట్టేలా అధికారులు ప్రయత్నా లు చేశారు. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయనుంది. జిల్లాలో పారిశ్రామికవేత్తలు, భూయజమానులతో సమావేశాలను ఏర్పాటు చేసినా ఎవరూ ముందుకు రాలేదు.

Updated Date - Nov 25 , 2026 | 12:21 AM