Share News

పరిశ్రమలకు ఊతం

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:40 AM

ఏలూరు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అడుగులు పడుతున్నాయి.

పరిశ్రమలకు ఊతం
జిల్లా పరిశ్రమల కేంద్రం కార్యాలయం

క్లస్టర్ల ఏర్పాటుకు అధికారుల కసరత్తు

వివిధ వృత్తుల ప్రోత్సాహానికి యూనిట్లు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

వ్యవసాయం, ఆక్వా రంగాల్లో ముందంజ వేస్తూ సాగుతున్న ఏలూరు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అడుగులు పడుతున్నాయి. పారిశ్రా మిక క్లస్టర్లు ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తు న్నారు. ఇటీవల రూ.10 కోట్లతో ఏలూరు లో తివాచీ పరిశ్రమను క్లస్టర్‌గా అభివృద్ధి చేయ డానికి ప్రాజెక్టు రిపోర్టు పంపించారు. ఇతర రంగాల్లో క్లస్టర్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలపై పరిశ్రమల శాఖ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. పరిశ్రమల విస్తరణ, వివిధ యూనిట్లను ఒకే గొడుగు కింద తీసుకురావడానికి ఉన్న అవకా శాలపై అన్వేషణ సాగుతోంది.

కుటీర, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం

జిల్లాలో 10 వేలకు పైబడి చిన్న తరహా, కుటీర పరిశ్రమలున్నాయి. మండలాల్లో ఒకే ఉత్పత్తి చేసే యూనిట్లను క్లస్టర్లుగా చేయాల్సి ఉంది. జిల్లాలో సిరామిక్‌, ఆక్వా ప్రాసెసింగ్‌, చేనేత మగ్గాలు, స్వర్ణకారులు, విడి పరికరాలు తయారుచేసే చిన్న యూనిట్లను పెద్ద సైజు వ్యాపార సంస్థగా ఒకే గొడుగు కింద తీసుకు రావాల్సి ఉంది. ప్రధానంగా రూ.కోటి నుంచి రూ.10 కోట్ల వ్యయం వరకు యూనిట్‌ స్థాపన దిశగా క్లస్టర్‌ ఉండాలి. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేచేసి యూనిట్లు గుర్తించాల్సి ఉంది. పారిశ్రామిక క్లస్టర్లు ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికి కేంద్రం వాటా 70 శాతం, రాష్ట్ర వాటా 20 శాతం, పది శాతం లబ్ధిదారులు భరించాలి. దీంతో యూనిట్ల స్థాపనలో అధికారు లకు సవాలే. చాలా వరకు పారిశ్రామిక క్లస్టర్లలో అఽధునాతన యంత్రాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కార్మికులు, ఇతర నైపుణ్యం కలిగిన పనివారు సైతం అవసరం. పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు కొంత భారమైనా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది.

అధికారులకు సవాల్‌

పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు అధికారులకు సవాల్‌గా మారింది. పరిశ్రమలశాఖలో వివిధ మండలాలు పర్యవేక్షించే క్లస్టర్‌ అధికారుల కొరత వేధిస్తోంది. ఇప్పటికే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో పాటు, పీఎంఈజీపీ యూనిట్ల స్థాపనలో అవస్థలు తప్పడం లేదు. యూనిట్ల గుర్తింపును చేపట్టే బాధ్యత ఎవరు తీసుకుంటా రనేది ప్రశ్నార్థకం. పరిశ్రమల కేంద్రం జీఎం వెంకట్రావు ఏలూరు జిల్లాకు ఇన్‌చార్జిగా ఉండగా, కృష్ణాజిల్లాలో పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండు జిల్లాల అధికారులు, సిబ్బందిని సమన్వయం కొంత ఇబ్బంది. జిల్లా లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు దిశగా మా ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపా రు. చిన్న పరిశ్రమల వారికి మెరుగైన ఉపాధి అవకాశాలకు ఇది దోహదపడుతుంది. దీనిపై సమగ్రంగా చర్చించి కార్యాచరణ రూపొందిస్తు న్నామని జీఎం వెంకట్రావు తెలిపారు.

Updated Date - Jun 03 , 2026 | 12:40 AM