Share News

రిటైర్డ్‌ ఎస్‌ఐ సీతారామ్‌కు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

ABN , Publish Date - Aug 16 , 2026 | 01:28 AM

బుట్టా యిగూడెంనకు చెందిన రిటైర్డ్‌ ఎస్‌ఐ కరిమికొండ సీతారామ్‌(రాంబాబు)కు కేంద్ర ప్రభుత్వం ఇండి యన్‌ పోలీస్‌ మెడల్‌ను ఆయనకు ప్రకటించగా దానిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శనివారం అందుకున్నారు.

రిటైర్డ్‌ ఎస్‌ఐ సీతారామ్‌కు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ను అందుకుంటున్న రిటైర్డ్‌ ఎస్‌ఐ కరిమికొండ సీతారామ్‌ (రాంబాబు)

ఏలూరు క్రైం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): బుట్టా యిగూడెంనకు చెందిన రిటైర్డ్‌ ఎస్‌ఐ కరిమికొండ సీతారామ్‌(రాంబాబు)కు కేంద్ర ప్రభుత్వం ఇండి యన్‌ పోలీస్‌ మెడల్‌ను ఆయనకు ప్రకటించగా దానిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శనివారం అందుకున్నారు. బుట్టా యిగూడెంనకు చెందిన కరిమికొండ జగ్గారావు, నాగమణి దంపతుల కుమారుడు కరిమికొండ సీతారామ్‌ 1984లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా పోలీస్‌శాఖలో చేరి అంచెలంచెలుగా పదోన్నతులు పొంది 2019లో ఎస్‌ఐగా అనేక చోట్ల పనిచేశారు. ఆయన 42 ఏళ్ల పోలీస్‌ సర్వీసులో అనేక ప్రశంసాపత్రాలు, అవార్డులు, రివార్డులు అందుకున్నారు. గంజాయి కేసులలో నేరస్తులను అరెస్టు చేయడం, అమాయక ప్రజలను మోసం చేసిన నకిలీ ఐపీఎస్‌ అధికారి కటుముల చంద్రశేఖర్‌ను అరెస్టు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో పనిచేసిన ఆయన పీడీఎస్‌ బియ్యం, గ్యాస్‌ సిలెండర్లు, ఎరువులు, విత్తనాలపై దాడులు చేసి నకిలీని గుర్తించి కేసులు నమోదు చేశారు. ఆహారం, కల్తీ కేసులలో గుర్తించిన నూనెలు, టీపొడి, బాదంపొడి, నెయ్యి, బెల్లం ఇతర వస్తువులు గుర్తించి కోట్లాది రూపాయలను సీజ్‌ చేశారు. ఆయన సర్వీసులో 168 నగదు బహుమతు లు, 21 ప్రశంసా సేవా పతకాలు, 26 జీఎస్‌ఈలు, ఉత్తమ సేవా పతకం, అత్కృష్ట సేవా పతకాలను అందుకున్నారు. ఇటీవల ఆయన ఉద్యోగ విరమణ పొందారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ను ప్రకటించిం ది. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అమరావతి పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో అందుకున్నారు. అవార్డు అందుకు న్న రిటైర్డ్‌ ఎస్‌ఐ రాంబాబును విజిలెన్సు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వ రరావు, ఇతర అధికారులు, సిబ్బంది అభినందించారు.

Updated Date - Aug 16 , 2026 | 01:28 AM