Share News

దివ్యాంగుల మోములో.. ఇంద్ర ధనస్సు

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:47 AM

కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఎన్నో ప్రయోజనాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు 50 శాతం రాయితీతో ఆర్టీసీ బస్సు లో ప్రయాణం చేసేవారితో పాటు ఇతరు లకు సంపూర్తిగా ప్రయోజనం ఇచ్చేలా ఇంద్రధనస్సు పథకం ద్వారా శ్రీకారం చుట్టింది.

 దివ్యాంగుల మోములో.. ఇంద్ర ధనస్సు

కూటమి ప్రభుత్వం తీపికబురు

ఇకపై ఆర్టీసీలో ప్రయాణం ఉచితం

ఉగాది నుంచి అమలుకు యోచన

జిల్లాలో 32,903 మంది దివ్యాంగ పింఛన్‌దారులు

50 శాతం రాయితీపై ఇప్పటికే 1,116 మంది ప్రయాణం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఎన్నో ప్రయోజనాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు 50 శాతం రాయితీతో ఆర్టీసీ బస్సు లో ప్రయాణం చేసేవారితో పాటు ఇతరు లకు సంపూర్తిగా ప్రయోజనం ఇచ్చేలా ఇంద్రధనస్సు పథకం ద్వారా శ్రీకారం చుట్టింది. ఉగాది కానుకగా ఉచిత బస్సు ప్రయాణాలకు విధి విధానాల రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమైంది.

దివ్యాంగులకు ఇప్పటికే పెన్షన్లు పెంచి కూటమి ప్రభుత్వం వారికి జీవితంపై భరోసా ఇచ్చింది. తాజా గా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలు మాదిరిగానే ఉచితంగా ప్రయాణాలకు అవకాశం కల్పించేలా చర్య లకు ఉపక్రమించింది. దీంతో వేలాదిమంది దివ్యాం గులకు ఇది మేలు చేకూర్చునుంది. ఈ పఽథకానికి ఇంద్రధనస్సుగా నామకరణం చేసింది.

ఉగాది కానుకగా ఉచిత ప్రయాణం

ఆర్టీసీ యాజమాన్యం నిర్వహణలో నడుస్తున్న ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణాలకు అనుమతి ఇవ్వాలని శాసనసభలో నిర్ణయించారు. దీనికి విధి విధానాలు రూపకల్పన జరిగాక ఉగాది కానుకగా అమలు చేసే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతు న్నారు. గతేడాది ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలకు అనుమతిచ్చిన విషయం తెలి సిందే. తాజాగా వికలాంగత్వం 40 శాతానికి పైగా ఉన్న వారికి ఉచిత ప్రయాణం వర్తింపు చేయను న్నారు. ప్రీమియం సర్వీసుల్లో 50 శాతం రాయితీ కొనసాగిస్తారు. ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కానుం ది. ఇప్పటికే 50 శాతం రాయితీతో 1,116 మంది ఆర్టీసీల్లో ప్రయాణాలు చేస్తున్నారు. వీరికి ఇక ఉచి తంగా బస్సు ప్రయాణాల్లో అనుమతి ఇవ్వనున్నారు. జిల్లాలో ప్రభుత్వం ప్రతినెల అందించే ఎన్టీఆర్‌ భరోసా దివ్యాంగ పింఛన్‌ను 32,903 మంది తీసుకుం టున్నారు. వీరందరికి ఏ ఇబ్బంది లేకుండా ఇంద్ర ధనుస్సు అమలు చేయనున్నారు. త్వరలో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉందని, ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా ప్రజా రవాణాశాఖాధికారి షేక్‌ షబ్నం తెలిపారు.

ఉచిత బస్సు ప్రయాణం ఒక మైలురాయి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప డుతున్న సంక్షేమ పథకాలతో పాటు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయా ణం ఒక మైలు రాయిగా నిలుస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన దివ్యాంగులకు ఇది ఒక గొప్ప ఊరటనిచ్చే అంశం.

– గోపీ, దివ్యాంగుడు ,ఏలూరు

శుభ పరిణామం

దివ్యాంగులందరికి ఉచిత బస్సు ప్రయాణాలను కల్పించడం శుభ పరిణామం. మహిళలుగా ఇప్పటికే మేము ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో సేవలను పొందుతున్నాం.

కె.అన్నామణి,దివ్యాంగురాలు,ఏలూరు

Updated Date - Feb 28 , 2026 | 12:47 AM