త్యాగధనుల స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధి
ABN , Publish Date - Aug 16 , 2026 | 01:27 AM
‘త్యాగ ధనుల స్ఫూర్తితో రాష్ర్టాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పునరంకింతం కావాలి. విక సిత్ భారత్– స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తోంది. ప్రజల ఆకాంక్షల కు అనుగుణంగానే సుపరిపాలన అందించి తీరతా’మంటూ రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారఽథి స్పష్టం చేశారు.
ప్రజల ఆకాంక్షలతో సుపరిపాలన
వ్యవసాయ, సాగునీటి రంగాలకు పెద్దపీట
పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి
మంత్రి కొలుసు పార్థసారఽథి.. ఏలూరు పరేడ్ గ్రౌండ్స్‌లో జెండా ఆవిష్కరణ
అట్టహాసంగా స్వాతంత్య్ర వేడుకలు
ఏలూరు, ఆగ స్టు 15(ఆంధ్రజ్యోతి): ‘త్యాగ ధనుల స్ఫూర్తితో రాష్ర్టాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పునరంకింతం కావాలి. విక సిత్ భారత్– స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తోంది. ప్రజల ఆకాంక్షల కు అనుగుణంగానే సుపరిపాలన అందించి తీరతా’మంటూ రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారఽథి స్పష్టం చేశారు.
ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో 80వ స్వాతంత్య్ర వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతి థిగా విచ్చేసిన రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాలకు ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. సీఎం చంద్రబాబు మార్గ దర్శకత్వంలో రాష్ట్రం ఘన చరిత్రను లిఖించడం ఖాయం. వ్యవసాయ, సాగునీటి రంగాలకు పెద్దపీట వేశాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా చింతలపూడి ఎత్తిపోతల పూర్తి చేస్తాం. ప్రపంచస్థాయి ఉత్తమ రవాణా సదుపాయాలు, విద్యుత్, ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ, అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ, స్వచ్ఛాంధ్రప్రదేశ్, నిత్య జీవితంలో డీ ప్ టెక్నాలజీ అంశాలతో కూడిన పది సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేస్తున్నాం. జిల్లాలో పీ–4 కార్యక్రమం కింద పేదరిక నిర్మూలనకు, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి 71,910 కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించి ఇప్పటి వరకు 44,114 కుటుంబాల్లోని 4,853 మందిని మార్గదర్శకుల ద్వారా దత్తత ఇచ్చాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలకు స్ర్తీ శక్తి పథకం ఎంతో దోహదపడింది. ఏడాది పూర్తయిన ఈ పఽథకం ద్వారా ఆడబిడ్డలు 2.12 కోట్ల మంది ఉచిత ప్రయాణాలను చేశారు. దివ్యాంగశక్తి ద్వారా ఉచిత ప్రయాణాలను 1,06,886 మంది దివ్యాంగులు వినియోగించుకోవడం శుభపరిణామం. రెవెన్యూ శాఖ ద్వారా ఇప్పటివరకు 5,502 మందికి చెందిన 5,520.81 ఎకరాలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాం. 662 గ్రామాల్లో భూ రికార్డులను కంప్యూటరీకరించి 1,24,207 మందికి పట్దాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందించాం. భవిష్యత్‌లో మరింత అభివృద్ది, సంక్షేమ పఽథకాలను కొనసాగిస్తా’మంటూ మంత్రి భరోసా ఇచ్చారు.
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు సన్మానం
స్వాతంత్య్ర సమరయోధుల సేవలను స్మరించుకుంటూ లింగపాలెం మండలం ధర్మాజీ గూడెంకు చెందిన గద్దె వెంకటేశ్వరరావు, ఉంగుటూరు మండలం రావులపర్రుకు చెందిన దూసన పూడి విరాటరాజు కుటుంబ సభ్యులను మంత్రి కొలుసు, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప కిశోర్ సత్కరించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, జేసీ అభిషేక్ గౌడ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, డీఆర్వో శ్రీదేవి,ఆర్డీవో లక్ష్మీప్రసన్న, జడ్పీ సీఈవో జగదాంబ, ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయడు, ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న పోలీసుల గౌరవ వందనం
ఏలూరు క్రైం : ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం జరిగిన 80వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పోలీసుశాఖకు చెందిన ఆరు విభాగాల కంటింజెంట్‌లు పాల్గొన్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పార్థసారథికి పరేడ్ కమాండర్ ఆర్ముడు రిజర్వు పోలీస్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్ సారఽథ్యంలో పోలీస్ బృందం గౌరవ వందనం అందించారు.
ఉత్తమ ప్రతిభకు పురస్కారాలు
11 మంది జిల్లా అధికారులు, 569 మంది ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు
ఏలూరు సిటీ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి):ఏలూరులోని పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన స్వాతంత్య్ర వేడు కల సందర్భంగా మెరుగైన పనితీరు, అత్యంత ప్రతిభ కనబరిచిన 11 మంది జిల్లా అధికారులు, 569 మంది వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లాలోని కలెక్టరేట్ నుంచి 17 మంది, రెవెన్యూ శాఖ నుంచి 38 మంది, పోలీస్ శాఖకు సంబంఽధించి 81మంది, వ్యవసాయ శాఖకు సంబంధించి 20 మంది, ఆత్మా శాఖకు సంబంధించి 8 మంది, పశుసంవర్థక శాఖకు సంబంధించి 13 మంది, ఏపీఈపీడీసీఎల్‌కు సంబంధించి 17 మంది, ఏపీఎంఐపీకి సంబంధించి 4గురు, ఏపీఎస్‌ఆర్టీసీకి సంబంధించి 6గురు, ఆడిట్ శాఖకు సంబంధించి 4గురు, ఆయుష్‌శాఖకు సంబంధించి ముగ్గురు, సివిల్ సప్లయీస్ శాఖకు సంబంధించి 5గురు, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ నుంచి 6గురు, కమర్షియల్ టాక్స్ నుంచి 7గురు, విభిన్న ప్రతిభావంతుల శాఖ నుంచి ముగ్గురు, డీఆర్‌డీఏ నుంచి 9మంది, వయోజనవిద్య నుంచి ఒక్కరు, ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ నుంచి ఒక్కరు, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి 4గురు, ఎస్‌ఎస్‌ఏ నుంచి ముగ్గురు, ఓకేషనరల్ ఎడ్యుకేషన్ నుంచి ముగ్గురు, ఎంప్లాయిమెంట్ నుంచి ఇద్దరు, దేవదాయ శాఖ నుంచి 4గురు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ నుంచి 8 మంది, బ్యాంకింగ్ ఫైనాన్స్ నుంచి ఇద్దరు, ఫైనాన్స్ పేఅండ్ అక్కైంట్స్ నుంచి 4గురు, ఫైర్ సర్వీస్ నుంచి 7గురు, మత్స్య శాఖ నుంచి 11 మంది, ఫారెస్ట్ నుంచి 5గురు, వైల్డ్‌లైఫ్ ఫారెస్ట్ నుంచి 5గురు, హార్టీకల్చర్ నుంచి 10 మంది, హౌసింగ్ నుంచి 9 మంది, ఇండస్ట్రీస్ నుంచి ఇద్దరు, ఇరిగేషన్ నుంచి 6గురు, మార్కెఫెడ్ నుంచి ఇద్దరు, డీఎంహెచ్‌వో నుంచి 16 మంది , డీసీహెచ్‌ఎస్ నుంచి 11 మంది, డ్రగ్స్ కంట్రోల్ నుంచి ఇద్దరు, ఎన్టీఆర్ వైద్యసేవ నుంచి ఇద్దరు, మెప్మా నుంచి 7గురు, మైన్స్ నుంచి ఇద్దరు, ఈడి క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ నుంచి ఒక్కరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 14 మంది, ఎన్‌ఐసీ నుంచి ఇద్దరు, నెడ్‌కాప్ నుంచి ఇద్దరు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ నుంచి 26, పీఐపీఆర్‌ఎంసీ నుంచి 9 మంది, ప్రణాళికా శాఖ నుంచి 5గురు, ఆర్‌అండ్‌బీ నుంచి 5గురు, ఆర్‌డబ్ల్యుఎస్ నుంచి 4గురు, సెట్‌వెల్ నుంచి ఇద్దరు, ఎస్ కార్పొరేషన్ నుంచి ఇద్దరు, సోషల్ వెల్ఫేర్ నుంచి 5గురు, సోషల్‌వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి ఒక్కరు, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ నుంచి 5గురు, సర్వేఅండ్ లాండ్ నుంచి 6గురు, రవాణా శాఖ నుంచి 9 మంది, ట్రెజరీస్ నుంచి 4గురు, ఐటీడీఏ నుంచి ముగ్గురు, మహిళా శిశు సందక్షేమ శాఖ నుంచి 13 మంది, జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి ముగ్గురు, జిల్లా జైళ్ళ శాఖ నుంచి 6గురు, సబ్‌జైల్ శాఖ నుంచి ఇద్దరు, ప్రభుత్వ ఐటీఐ నుంచి ఇద్దరు, ఎస్‌జీఎస్‌డబ్ల్యు నుంచి 7గురు, ఏసీబీ నుంచి ఇద్దరు, స్పోర్ట్స్ నుంచి ముగ్గురు, ప్రభుత్వ డిగ్రీ కాలేజి నుంచి ఒక్కరు, డ్వామా శాఖ నుంచి 12 మంది, సీఐసీహెచ్‌డబ్ల్యు ధవళేశ్వరం యూనిట్ నుంచి 10 మంది, జిల్లా పరిషత్ నుంచి 13 మంది, పబ్లిక్ హెల్త్ నుంచి ఇద్దరు, జేసీ పేషీ నుంచి ఇద్దరు, యుడా నుంచి ముగ్గురు, డీడీ ప్రాసిక్యూషన్స్ నుంచి ఇద్దరికి ప్రశంసా పత్రాలను అందజేశారు.