ఖాకీ నీడలో..
ABN , Publish Date - May 03 , 2026 | 12:34 AM
ఆకివీడు పెదపేట రామాలయాన్ని పునఃనిర్మాణం సంద ర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
600 మందితో పోలీసు బందోబస్తు
భీమవరం క్రైం, మే 2(ఆంధ్రజ్యోతి):ఆకివీడు పెదపేట రామాలయాన్ని పునఃనిర్మాణం సంద ర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన వివాదాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఏలూరు రేంజ్ పరిధి నుంచి సుమారు 600 మంది పోలీసులతో గస్తీ నిర్వహిస్తున్నారు. వీరిలో ఎస్పీతోపాటు ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 20 మందిసీఐ లు, 80 మంది ఎస్సైలు, సుమారు 500 మంది కానిస్టేబుళ్లు ఉన్నట్టు ఎస్పీ కార్యాలయం తెలి పింది. ఆకివీడు పట్టణం రెండు వైపులా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. 144 సెక్షన్ అమలులో వున్న నేపథ్యంలో ఎవరూ గుమిగూడి ఉండకూడదని, సభలు, సమావేశాలు, ఎటువంటి మీటింగ్‌లు పెట్టడానికి అనుమతు లు లేవని ఎస్పీ కార్యాలయం తెలిపింది. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే వారిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిం చారు. ఆదివారం ఉదయం 7.14 గంటలకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దంపతులు రామాలయ శంకుస్థాపనలో పాల్గొంటారు.
పోలీసు నిర్బంధాన్ని ఎత్తేయాలని నిరసన
భీమవరం టౌన్: ఆకివీడు పెదపేట ప్రజ లపై పెట్టిన పోలీస్ నిర్బంధాన్ని ఎత్తివేయా లని కేవీపీఎస్, ప్రజా సంఘాల నేతలు డి మాండ్ చేశారు. శనివారం ప్రకాశం చౌక్ వద్ద చేపట్టిన ఆందోళనలో సీపీఎం జిల్లా కార్యదర్శి గోపాలన్ మాట్లాడుతూ కోర్టు పరిధిలో వున్న గొంతెనమ్మ గుడిని అక్రమంగా కూల్చి వేశార న్నారు. 144 సెక్షన్ పేరుతో దళితులను వేధిస్తు న్నారని, వారిపై పెట్టిన అక్రమ నిర్బంధాలను, కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉండి నియోజకవర్గంలో దళితులపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు యుద్ధం ప్రకటించి వేధిస్తున్నారని కాంత్రికుమార్ మండిపడ్డారు. ఆందోళనలో సంఘాల నాయకులు బి.వాసు దేవరావు, కె.రాజారామ్మోహన్‌రాయ్, జె.సత్యనా రాయణ తదితరులు పాల్గొన్నారు.