Share News

తవ్వేస్తున్నారు!

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:55 AM

ఆగిరిపల్లి మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. మంత్రి కె.పార్థసారథి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ మట్టి మాఫియా ఆగడాలకు అంతు లేకుండా పో యింది.

తవ్వేస్తున్నారు!
ఈదర గట్టుపై గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు

ఎట్టకేలకు స్పందించిన అధికారులు

రెండు ట్రాక్టర్లు, ఎక్స్‌కవేటర్లు స్వాధీనం

నూజివీడు/ఆగిరిపల్లి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఆగిరిపల్లి మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. మంత్రి కె.పార్థసారథి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ మట్టి మాఫియా ఆగడాలకు అంతు లేకుండా పో యింది. టీడీపీ నాయకులు కొందరు మంగళవారం ఈదర గ్రామంలో మట్టి రవాణా సాగించారు. గురుగట్టుపై అక్రమ తవ్వకాలు విలేకరులు అధి కారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో 2 ట్రాక్టర్లు, ఎక్స్‌కవేటర్‌ స్వాధీనం చేసుకున్నారు.

గ్రామ అవసరాల కోసం అనుమతి

గ్రామ అవసరాలకు మట్టి తవ్వకానికి అనుమతి స్తామని, అవసరమైనవారు సంప్రదించాలని మంత్రి పార్థసారథి చెప్పి రెండు రోజులకే ఈదర గ్రామంలో అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారు. అధికారులు అడ్డుకోవడంతో రహదారుల కోసం అని సాకులు చెబుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అధికారిక అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రశ్న తలెత్తుతోంది. పగలు ట్రాక్టర్లుతో సమీప గ్రామాల్లో, రాత్రివేళ టిప్పర్లతో దూరప్రాంతాలకు గ్రావెల్‌ తరలిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి.

మట్టి తవ్వకాల జోరు

ముదినేపల్లి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొమ్మినంపాడు, ఈడేపల్లి, ముల కలపల్లి గ్రామాల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతి లేకుండా చెరువులు తవ్వకం, స్థలాల పూడిక పనులు చేస్తున్నారు. ఈడేపల్లిలో తవ్వకాలను మంగళవారం గ్రామ స్థులు అడ్డుకున్నారు. ములకపల్లిలో మట్టి రవాణా అడ్డుకోవాలని అధికార్లకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికార్ల దృష్టికి తీసుకెళతానని వీఆర్వో శ్రీరాములు తెలిపారు.

క్వారీలు ఖాళీ

తాడేపల్లిగూడెం రూరల్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో ఎర్రమట్టి క్వారీలు ఖాళీ అవుతున్నాయి. ఏళ్ల తరబడి తవ్వేయడంతో వందల ఎకరాల్లో గ్రావెల్‌ తరిగిపోయింది. ఆరుగొలను, కొత్తూరు, దండగర్ర, జగన్నాథపురం రెవెన్యూ గ్రామాల పరిధిలో గ్రావెల్‌ తవ్వకాలను మైనింగ్‌ అధికారులు అడ్డుకున్నారు. రాత్రి సమయంలో తవ్వి తరలిస్తున్నారనే ఆరోపణలతో రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు నిఘా పెట్టారు.

Updated Date - Mar 25 , 2026 | 12:55 AM